వచ్చిన వారు

Showing posts with label స్వయం ఉపాధి. Show all posts
Showing posts with label స్వయం ఉపాధి. Show all posts

Thursday, November 14, 2019

అంకుర సంస్థల (start-up enterprises) స్థాపన – 2



ముందుభాగం 

              



వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ స్థాపించాలంటే మూలధనం సమకూర్చుకోవడం తో పాటుగా ప్రభుత్వం వద్ద నుంచి ఆయా వ్యాపారాల కి తగిన లైసెన్స్ లు మరియు అనుమతులు మంజూరు కావాలి. మూలధన సమీకరణ కొరకు బ్యాంకుల వద్దకి వెళ్ళాలి. ఇవన్నీ సమకూరాక వ్యాపారాన్ని సమర్ధవంతంగా నిర్వహించుకోవాలి. ఈ ప్రోసెస్ లో జరిగే కాలయాపన వలన కావచ్చు, సమాచార లోపం వలన కావచ్చు, చాలామంది ఔ త్సాహికులైన యువత ఈ రంగంలోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారు.

మన  జిడిపి లో సేవారంగం వాటాతో పాటు సెర్వీసెస్ రంగం వాటాని పెంచవల్సిన ఆవశ్యకతని మన ప్రభుత్వం  గుర్తించింది. వ్యాపారరంగ అభివృద్ధి కొరకు చిన్న మధ్యతరహా పరిశ్రమల  అభివృద్ధి కొరకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు  ఇవ్వల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ రంగం లో ఎన్నో మార్పులు, చేర్పులు చేసారు. 


వ్యాపారసంస్థ ప్రారంభం అనుకున్నంత కఠినతరం కాదు. అంకుర సంస్థను ప్రారంభించటానికి అనుసరించాల్సిన పద్ధతులు , తీసుకోవాల్సిన అనుమతులు, ఋణసదుపాయం కోసం సంప్రదించాల్సిన బాంకుల వివరాలు ... అసలు ప్రాధమికంగా ప్రస్తుతం ఏయే పథకాలు ఉన్నాయి ?  అవి సబ్సిడీలు  ఎలా ఇస్తున్నాయి అన్న విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఈ అంశాల మీద పట్టు మనకి వ్యాపార ప్రారంభానికి ఊతం  అవుతుంది. .

      
        ఇక వచ్చే  పోస్ట్ లలో ఈ విషయాలన్నీ పరిశీలిద్దాం. ఈ పోస్ట్ ల యొక్క ముఖ్య ఉద్దేశ్యం యువతకి సరైన సమాచారం అందిచడం. దానివల్ల ఔత్సాహికులు ప్రభుత్వ పథకాల్ని మరియు మార్కెట్ లో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. 

ఇంకా ఉంది. 


Sunday, October 20, 2019

అంకుర సంస్థల (start-up enterprises) స్థాపన – 1





అంకుర సంస్థల స్థాపన 1
(start-up enterprises 1)

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. పారిశ్రామికంగా మన దేశం అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కొన్ని సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి, వ్యాపారం చేయాలని అనుకుంటున్నవారు, ఆర్ధిక భద్రత  ఉండదని భావించటం, గతంలో వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళని చూసి భయపడటం,  వ్యాపారం ప్రారంభించడానికి, అది లాభాల బాట పట్టేదాక నిలదొక్కుకోవడానికి తగినంత ఆర్ధిక స్తోమత లేకపోవడం, ఉద్యోగంలో బధ్రత అంటే, నెలవారీ జీతం, పెన్షన్  స్థిరంగా ఉండవనే అభిప్రాయం,  జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, వ్యాపారాలలో వచ్చే ఒడిదుకులని అధిగమించలేరనే భయంతో పెద్దవాళ్ళు వారించటం వంటివి. కారణాలు ఏవైనా, మన దేశంలో చాలా మంది జాబ్ సెక్యూరిటీకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. చదువుకి, ఉద్యోగానికి ప్రోత్సాహమిచ్చే తల్లితండ్రులతో పోలిస్తే వ్యాపారానికి ఎంకరేజ్ చేసే పేరంట్స్ చాలా తక్కువ. మన విద్యా విధానం కూడా అందుకు అనువుగా లేదు.  ఒక ఎంట్రప్రినియర్ గా స్థిరపడాలంటే మిగిలిన సవాళ్ళతో పాటు వీరిని ఒప్పించడం కూడా ఒక సవాలే నేటి తరానికి.

 ఈ సామాజిక సమస్యలకి  కారణాలు  ఏమిటి ???

కేవలం అవగాహనా లోపం, మార్పుని ఒప్పుకోలేకపోవడం, మార్పుని ఒప్పుకుంటూ, నైపుణ్యాలు పెంచుకుంటూ పోతే ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు.  కానీ ఎలా ???  ఒక ఉద్యోగానికి అప్ప్లై చెయ్యాలంటే ఇన్ని ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే ఆ రంగం ఒకరు నడిచిన దారి. ఒక వ్యాపారానికి మాత్రం ఈ ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే అది మీరు వేసే దారి. మీతో పాటు పదిమందిని నడిపించే దారి. చాలా మందికి అనిపించవచ్చు, ఎందుకు ఇంత రిస్క్ చేసి ఈ  రంగమే ఎంచుకోవాలి ? అని... అసలు వ్యాపార రంగం చుట్టూ ఎందుకింత భయాలు, అపోహలు ఉన్నాయి. వీటికి సంబందించి సాంకేతిక కారణాలు ఇప్పుడు పరిశీలిద్దాం. 
 ఒక దేశం ఆర్ధికంగా అభివృద్ధి  చెందాలంటే పరిశ్రమల స్థాపన , వ్యాపారాల స్థాపన అత్యవసరం. వీటి వలన ఉపాధి అవకాశాలు, ప్రజల ఆర్ధిక ప్రమాణాలు పెరుగుతాయి. తద్వారా ప్రజలకి క్వాలిటీ లైఫ్ అందుబాటులోకి వస్తుంది. అయితే అన్ని దేశాలలో వీటికి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నయా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది.  ముఖ్యంగా అభివృధ్హి చెందుతున్న దేశాల సరసన ఉన్న భారతదేశంలో పరిశ్రమల స్థాపనకి, వ్యాపారాల స్థాపనకి ఉన్న అవకాశాలేమిటి ? అడ్డంకులు ఏమిటి ?  వీటికి గల సామాజిక మరియు ఆర్ధిక కారణాలు ఇప్పుడు పరిశీలిద్దాం. మెరుగైన అవకాశాలు, దానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు తెలుసుకుందాం. సంప్రదాయ ఉద్యోగాల మీద ఆసక్తి లేని యువతకి ఏ ఏ మార్గాలున్నాయన్న విషయాలు చర్చిద్దాం. విజయవంతమైన వ్యవస్థాపకులుగా మన కొత్త తరాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఏం చెయాలన్నది పరిశీలిద్దాం.
...ఇంకా ఉంది

    
    


Sunday, September 29, 2013

C F L బల్బుల తయారీ - లాభాలు....

స్వయం ఉపాధి పధకాలలో C F L బల్బుల తయారీ ఒక లాభదాయకమైన రంగము. ఈ బల్బులకి మార్కెట్ డిమాండ్ కూడా బాగా ఉంది. వీటి గురించి మరియు ఈ బల్బుల తయారీలో వచ్చే లాభాలను గురించి క్లుప్తంగా చూద్దాం.

Sunday, May 5, 2013

గ్రూప్ కి ఆహ్వానం


చిరుదీపం కొత్త గూగుల్ గ్రూప్ కి ఆహ్వానం. 

బ్యాంక్ పరిక్షల కోచింగ్, స్టడీ మెటీరియల్, సందేహ నివృత్తి, వివిధ స్వయం ఉపాధి పథకాల గురించి సమాచారం మరింత వివరంగా ఇవ్వడానికి ఆస్కారం వుంటుందనే ఆలోచనతో అభ్యర్ధుల సౌకర్యార్ధం కొత్త గ్రూప్ ప్రారంభించాం. 

ఆసక్తి వున్నవారు chirudeepamu@gmail.com కి మెయిల్ పంపితే గ్రూప్ కి  ఇన్విటేషన్ పంపుతాము.
    
   

Wednesday, December 26, 2012

హామీ / తనఖా లేని ఋణాలు...

      
         సాధారణంగా ఏదైనా పరిశ్రమ / సేవల రంగంలో వ్యాపారం ప్రారంభించాలి అంటే  బ్యాంక్ లోన్ చాలా సంధర్భాలలో అవసరమవుతుంది. బ్యాంక్ లోన్ లేకుండా పూర్తిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన సొంత పెట్టుబడి తోనే ప్రారంభించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ లు  సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ లోన్  తప్పనిసరి అవుతుంది.

Friday, December 14, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 3


పసుపుకొమ్ములు సేకరించాక వాటిని ఆరబెట్టి , తుడిచి శుభ్రం చేస్తారు. 
తర్వాత వాటిని ఒక డ్రమ్ లో వేసి యంత్ర సహాయంతో తిప్పుతారు. దీని
వలన పైన ధూళి అంతా పోయి శుభ్రమవుతుంది. తర్వాత వాటిని గ్రేడింగ్

Thursday, December 13, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 2

ఇంతకు ముందు టపాలో  చెప్పిన్నట్లు గా ఈ రంగంలోని పరిశ్రమల గురించి  ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా చుద్దాం. 


Sunday, October 28, 2012

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 7


మిల్క్ ప్రొసెసింగ్ గురించి నాకు వచ్చిన ఈ మెయిల్స్ ను చూసాక ఈ రంగం గురించి మరి కొచెం విగా
...


Friday, October 26, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 1

        మన దేశ  ప్రజలలో 70 % వ్యవసాయం మీద ఆధారపడ్డా, జిడిపి లో వ్యవసాయం రెండు శాతం మాత్రమే. మన నాయకుల పుణ్యామా అని నేడు వ్యవసాయం, పేదరికం రెండూ పర్యాయపదాలు అయిపోయాయి. ఈ వ్యవసాయానికి విలువ ఆధారితాలని జోడించడం ద్వారా వ్యవసాయానికి  వివిధ పరిశ్రమలకి, రైతులకి మంచి ఆదాయం వస్తుంది. 

Friday, September 14, 2012

సేంద్రియ వ్యవసాయము - భారత ప్రభుత్వ సబ్సిడీ పధకములు...


సేంద్రియ వ్యవసాయము ను ప్రొత్సాహించడానికి భారత ప్రభుత్వము Capital Investment subsidy scheme for  commercial production units of organic inputs అనే పధకము ద్వారా  సబ్సిడీ ని అందిస్తుంది. దాని గురించి వివరాలు

Wednesday, August 8, 2012

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 2

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 2

వెర్మి కల్చర్ యూనిట్ స్థాపనకు, అయ్యే వ్యయం మరియు వచ్చే లాభం గురించిన వివరాలు ఇప్పుడు  

Sunday, August 5, 2012

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 1

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 1
            
              ఈ రొజులలో  బాగా ఎక్కువగా వినిపిస్తున్న వ్యవసాయ విదానము సేంద్రియ వ్యవసాయము ( Organic Farming). నిజానికి ఇది మన దేశానికి కొత్త కాదు. రసాయన ఎరువులు, మందుల ధాటికి  మరుగున పడి, మళ్ళీ మన పూర్వ వైభవం దిశగా నడుస్తున్న వ్యవసాయ విదానమే మన సేంద్రియ వ్యవసాయము.

Sunday, July 29, 2012

స్వయం ఉపాధి: పుట్టగొడుగుల (మష్రూమ్) ఉత్పత్తి -1

పుట్టగొడుగుల ఉత్పత్తి - 1

పుట్ట గొడుగులు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. దీని వలన పెంచినవారికి ఆదాయము, తిన్న వారికి పౌష్టికాహారము లభిస్తాయి. ఈ వ్యాపారము / వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగిన వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. దీని వాడకము ప్రస్తుతము పట్టణాలలో ఎక్కువగానే ఉంది. నెమ్మదిగా విస్తరిస్తోంది. దీనిని శాకాహారము గా భావించడం వలన కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.

Friday, August 26, 2011

ఔత్సాహిక పెట్టుబడిదారులకి శుభవార్త ...

పాల కేంద్రం  ద్వారా  స్వయంఉపాధి పొందాలనుకునే ఔత్సాహిక పెట్టుబడిదారులకి శుభవార్త . 
ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య  ఇదివరలో మూసివేసిన పాలకేంద్రాలు తిరిగి తెరవాలని నిర్ణయించింది. మొత్తం కేంద్రాలు 35 ( కోస్తా 4,రాయలసీమ 13,తెలంగాణ  20    మొత్తం కెపాసిటీ  71,100  లీ.) . 
ఈ కేంద్రాల నిర్వహణ కై బిడ్ లని ఆహ్వానిస్తోంది. 

పాల కేంద్ర స్థాపన ,నిర్వహణ, లాభార్జన , కావల్సిన మెషినరీ మొదలగు వివరాలకై ఇదివరలో నేను వ్రాసిన టపాలు  1 , 2 , 3 , 4 , 5 , 6

ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కై  పూర్తి ప్రకటన చూడండి.

ఎపి డైరీ   వెబ్ సైట్  

గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.  
    
   
   


Thursday, May 26, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 6

Khoa Processing  Unit


రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము లో 300-400 లీటర్లు Khoa కోసం కేటాయించు కొంటే మంచిది. దీనికి .....


Capital Investment

01. Building 100 Sq.Ft
02. Equipment for dessication  and others  కి సుమారు గా Rs. 50,000/- దాకా అవుతుంది.

            
రోజు కి variable cost  సుమారు గా Rs. 12,000/- దాకా అవుతుంది
రోజు కి ఆదాయము (75 kgs Khoa @Rs.175/- per Kg )   సుమారు గా Rs. 13125/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము   సుమారు గా Rs. 1,000/- దాకా వస్తుంది



 PANEER Processing Unit

రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము లో 300-400 లీటర్లు Paneer కోసం కేటాయించు కొంటే మంచిది. దీనికి .....

Capital Investment

01. Building 150 Sq.Ft
02. Refrigeration units, bhatti and others
  కి సుమారు గా 
Rs. 1,50,000/- దాకా అవుతుంది.
            
రోజు కి variable cost  సుమారు గా Rs. 8,500/- దాకా అవుతుంది
రోజు కి ఆదాయము (50 kgs Paneer  @Rs.200/- per Kg )   సుమారు గా Rs. 10,000/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము   సుమారు గా Rs. 1,500/- దాకా వస్తుంది
  
       
            
        
   

Wednesday, May 25, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 5

Setting Up Creamery Unit


ఇంతకు ముందరి పోస్ట్ ల లో Milk Processing Unit with minimum capacity  గురించి చర్చించాము.  అయితే రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము ఉంటే మిగిలిన ఉత్పత్తులు (Creamery, Khoa Processing,Paneer etc) లాభసాటిగా చేయవచ్చు. ఇందులో Creamery Unit గురించి  ఈ టపాలో ...

Capital Investment

01. Building 240 sQ.Ft
02. Cream separator 500liters/hr
03. Ghee Boiling Vat 

04. Gas Burner
05. High power regulator for burner
06. Weighing balance
07. Containers 100 ltr capacity 3 numbers (for cream storage)
08. Buckets, spatula , G.I drum and miscellaneous items


సాధారణంగా పైన చెప్పినవి కావాలి.వాటి కి సుమారు గా Rs. 2,00,000/- దాకా అవుతుంది.
            రోజు కి variable cost  సుమారు గా Rs. 23,000/- దాకా అవుతుంది
            రోజు కి ఆదాయము   సుమారు గా Rs. 25,000/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము   సుమారు గా Rs. 2,000/- దాకా వస్తుంది

 
         
        
          




Tuesday, May 3, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 4

మిల్క్ ప్రొసెస్సింగ్ యూనిట్ లో వాడే మెషినరీ వివరాలు కొందరు అడిగినందువలన ఆ వివరాలు వ్రాస్తున్నాను.
The machinery should be made of good quality stainless steel.

 Details of Machinery :


1. Building 300 - 500 s.qft floor area Rent/ Own
2. Double jacketed vat for heating milk  (Stainless steel - 250 lts capacity )
3. Bulk cooler
4. Refrigeration Unit
5. Cream separator
6. Weighing machine
7. Sealing machine
8. Fat testing machine
9. Cans, plastic containers etc. 

ఈ మొత్తం మెషినరీ  (500 lts per day ) కి ఇంచుమించుగా  
Rs. 2,50,000.00  అవ్వవచ్చును.
Variable cost + Fixed expenses per day Rs. 13,500.00

Profit per day Rs. 1500 (approx)  


వ్యాపార విస్తరణకి ఈ యూనిట్ కి అనుబధంగా తయారు చేసే ఉత్పత్తుల గురించి ( కోవా , ఐస్ క్రీం ........) తరువాతి టపాలలో తెలుసుకుందాము.
      
       
        

Tuesday, April 26, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 3 ( వచ్చే లాభమెంత ..? )

ఈ టపా ముందు భాగాలు స్వయంఉపాధి / వ్యవసాయం లేబుల్స్ లో చూడవచ్చు.


వచ్చే లాభమెంత ..?

ఉదాహరణకి ఒక 500 లీటర్ల పాల ప్రొసెస్సింగ్ ప్లాంట్ కి ఏఏ వసతులు కావాలి, ఎంత పెట్టుబడి కావాలి ఎంత లాభం వచ్చే అవకాశం ఉందో ఈ టపాలో చర్చిద్దాం.

ప్లాంట్, మౌలికవసతులు గల( రోడ్.నీరు మొదలైన సదుపాయాలు) గల ఒక మేజర్ పంచాయితీలో పెట్టగలిగితే మంచిది. పాల యొక్క ధర నిర్ణయం FAT / SNF  పరీక్ష ద్వారా నిర్ణయించాలి. ఈ  షరతులు పాటించి వ్యయ నిర్ణయం లాభనిర్ణయం జరిగిందని గమనించండి.  

ప్లాంట్ కి కావలసిన యంత్రసామాగ్రి వీటినే స్థిర ఆస్థులు గా చెప్పవచ్చు  ఉదాహరణకి బరువు తూచే యంత్రం , Bulk Cooler, Refrigeration unit, Cream Separator, Fat testing machine... మొదలైనవి  వీటికి సుమారుగా 2,50,000 రూపాయలు  అవుతుంది.( ఇందులో భవనం అద్దె కలుపలేదు).

పాల కొనుగోలు, సిబ్బంది జీతాలు మొదలైన చర ఖర్చులకి  రోజుకి సుమారుగా 13,200   రూపాయలు అవుతుంది. దీనికి బ్యాంక్ వడ్డీ, తరుగుదల వంటివి కలిపితే 13,500  రూపాయలు అవుతుంది.

పాలు, వెన్న అమ్మకము ద్వారా రొజుకు   15,000 రూపాయలు దాకా ఆదాయము వస్తుంది. అంటే రొజుకు  1500 రూపాయలు లాభం.

ఇవి కాక నిలువ ఉండే పనీర్,  నెయ్యి మొదలైన అదనపు ఉత్పత్తులు చెయ్యగలిగితే  మరింత వ్యాపారం విస్తరిస్తుంది.

పాలు సంపూర్ణపోషకాహారం అంటారు. పసిపిల్లలు , రోగులు, గర్భిణీలు, ఎక్కువగా ఆధారపడే పాలు అమ్మకంలో నాణ్యత పాటించండి.శుభ్రత ని పాటించండి.  ఆరోగ్యాలకి హాని చేసే రసాయనాలు కలపకండి. మీరు పాటించే విలువలు మీ వ్యాపారానికి ప్రధమ పెట్టుబడి. వినియోగదారుని విశ్వాసం చూరకొనటమే అసలైన లాభార్జన.

బ్యాంక్ ఋణము కావలసిన వారు ఇంతకు ముందు వ్రాసిన PMEGP 1 , PMEGP- 2 టపాలు చూడండి.

మరిన్ని ఋణ పథకాలు తరవాత టపా లలో తెలియచేస్తాను. మిల్క్ ప్రొసెస్సింగ్ లో మరిన్ని ఉపాధి అవకాశాలని కూడా తరువాత టపా లలో తెలుసుకుందాము.
               
               


        

Sunday, April 24, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 2

       సంస్థ లాభాలలో పయనించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటిలో ముఖ్యమైనది ప్లాంట్ స్థాపించే స్థల నిర్ణయం . ప్లాంట్ పాలు సేకరించుకోడానికి మరియు వాటిని మార్కెట్ చెయ్యడానికి అనువుగా ఉండాలి . అంటే ఎంచుకునే స్థలం అటు పాల అమ్మకందారులకి ఇటు మన వినియోగదారులకి దగ్గరగా ఉండేలా ఎంచుకోవడము గనుక సాధ్యపడితే రవాణా ఖర్చులు కలసి వస్తాయి. రోజుకి 500 లీటర్ల  పాలు ప్రోసెస్ చెయ్యడానికి సుమారుగా 300 నుండి 500 చదరపు అడుగులు వైశాల్యం ఉన్న  భవనం ( ఇల్లు/దుకాణం )  సరిపోతుంది. గాలి, వెలుతురు , నీటివసతి,  శుభ్రపరచడానికి అనువైన ఫ్లోరింగ్ అవసరం.
 

        ప్లాంట్ పెట్టాలనుకున్న ప్రదేశానికి చుట్టుపక్కల గల పాడి పశువులు శాతం ఎంతవరకు ఉన్నది, వాటి వయస్సు, జాతి, అంటే  పాల లభ్యత ఏవిధంగా ఉందో తెలుసుకోవాలి. 
        పాల వ్యాపారులు/రైతులు పాలని ఏవిధంగా విక్రయిస్తున్నారు ఏ రేటుకి విక్రయిస్తున్నారో తెలుసుకోవాలి . పాల యొక్క నాణ్యత పరిక్షించుకోవాలి.
ప్లాంట్ పెట్టాలనుకునే ఔత్సాహికులకి ఎవరికైనా ఈ విషయం గా మరింత సమాచారం కావాలంటే కామెంట్ ద్వారా సంప్రదించవచ్చు.


వచ్చే టపాలో లాభం,  బ్యాంక్ ఋణం గురించి తెలియచేస్తాను. 

           
            
         

Saturday, April 23, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ 1

     యువతరంకి ఎదిగే అవకాశం  ఉన్న రంగాలలో పాల ప్రాసెస్సింగ్  ఒకటి.   ఈ రంగంలో స్వయంఉపాధి అవకాశాలు వినియోగించుకుని స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలని అర్జించవచచ్చును నలుగురికి ఉపాధి కల్పించవచ్చు.
         
     పాల ఉత్పత్తిలో భారతదేశము మిగిలిన దేశాలన్నిటి కన్నా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఒక సర్వే ప్రకారం దేశ జనాభా లో 25% మంది ప్రత్యక్షంగా  20%   పరోక్షంగా పాల మీద,  పాల ఉత్పతుల మీద వచ్చే ఆదాయం మీద   ఆధారపడి జీవిస్తున్నారు. ఇదివరకులా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు  పాకేజ్డ్ పాల కి ప్రాధాన్యత ఇస్తున్నారు.  పాల ఉత్పత్తుల వాడకం కూడా ఇదివరకు మీద ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చిన్న వ్యాపారస్థులు పాలని నిలువ ఉంఛే సామర్ధ్యం లేకపోవడం వలన పాలు పాడై పోయి నష్టపోతున్నారు. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటొంది. ఈ కాలంలో కాలరీత్యా  వచ్చే కొరతకి ఈ నష్టం తోడవ్వడం వలన అటు వాడుకదారులు ఇబ్బంది పడుతున్నారు ఇటు  పాల వ్యాపారులు నష్టపోతున్నారు. 

             మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్  ద్వారా పాలు నిలువ ఉండే సామర్ధ్యం పెరుగుతుంది. తద్వారా పాలు పాడవడం వలన వచ్చే నష్టాన్ని నివారించవచ్చు మిగిలిన పాలతో పచ్చికోవా , పన్నీరు, పెరుగు , సుగంధి  పాలు మొదలైన వాటి తయారీ ద్వారా అదనపు ఆదాయం  పొందవచ్చు. అయితే ఈ పాల ఉత్పత్తిల కి ఎంత  మేరకు ఆదరణ ఉందన్న సందేహం రావచ్చు. ప్రజల పాలు, పాల ఉత్పత్తుల  వినియోగం ఇలా ఉంది. 
             పెరుగు -
7%
             కోవా - 7%
             వెన్న - 6.5%
             నెయ్యి - 27.5%
             పనీర్ - 7%
             పాలు - 45 %.

       ఈ రంగంలో  ఔత్సాహిక వ్యాపారవేత్తలకి స్వయంఉపాధి  అవకాశాలు మిక్కుటం గా ఉన్నాయి. ప్రకృతి, సర్కారు దెబ్బలతో అల్లాడుతున్న  వ్యవసాయదారులు కూడా కొద్ది పెట్టుబడి తో 
మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్  స్థాపించుకోగలితే స్థిరమైన ఆదాయం పొందవచ్చును.  ఈ వ్యాపారంలో  కనీసం Rs. 2.50 లక్షల పెట్టుబడి పెడితే నెలకి Rs.45,000 వరకు  ఆదాయం పొందే అవకాశం ఉంది.
  

    ఈ  వ్యాపారం లో వచ్చే లాభాల వివరాలు, స్థాపనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిశీలించవలసిన / దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు, బ్యాంక్ ఋణం ఎంతమేరకు ఏవిధంగా లభిస్తుందో వచ్చే టపాలలో తెలియచేస్తాను.