వచ్చిన వారు

Sunday, April 24, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 2

       సంస్థ లాభాలలో పయనించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటిలో ముఖ్యమైనది ప్లాంట్ స్థాపించే స్థల నిర్ణయం . ప్లాంట్ పాలు సేకరించుకోడానికి మరియు వాటిని మార్కెట్ చెయ్యడానికి అనువుగా ఉండాలి . అంటే ఎంచుకునే స్థలం అటు పాల అమ్మకందారులకి ఇటు మన వినియోగదారులకి దగ్గరగా ఉండేలా ఎంచుకోవడము గనుక సాధ్యపడితే రవాణా ఖర్చులు కలసి వస్తాయి. రోజుకి 500 లీటర్ల  పాలు ప్రోసెస్ చెయ్యడానికి సుమారుగా 300 నుండి 500 చదరపు అడుగులు వైశాల్యం ఉన్న  భవనం ( ఇల్లు/దుకాణం )  సరిపోతుంది. గాలి, వెలుతురు , నీటివసతి,  శుభ్రపరచడానికి అనువైన ఫ్లోరింగ్ అవసరం.
 

        ప్లాంట్ పెట్టాలనుకున్న ప్రదేశానికి చుట్టుపక్కల గల పాడి పశువులు శాతం ఎంతవరకు ఉన్నది, వాటి వయస్సు, జాతి, అంటే  పాల లభ్యత ఏవిధంగా ఉందో తెలుసుకోవాలి. 
        పాల వ్యాపారులు/రైతులు పాలని ఏవిధంగా విక్రయిస్తున్నారు ఏ రేటుకి విక్రయిస్తున్నారో తెలుసుకోవాలి . పాల యొక్క నాణ్యత పరిక్షించుకోవాలి.
ప్లాంట్ పెట్టాలనుకునే ఔత్సాహికులకి ఎవరికైనా ఈ విషయం గా మరింత సమాచారం కావాలంటే కామెంట్ ద్వారా సంప్రదించవచ్చు.


వచ్చే టపాలో లాభం,  బ్యాంక్ ఋణం గురించి తెలియచేస్తాను.