IBPS ( Institute of Banking Personal Selection) IBA ఆధ్యర్యంలో నడుస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఈ సంస్థ 19 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు ల తరఫున PO ( Probationary Officer ) ఉద్యోగాని కై సంవత్సరానికి 2 సార్లు ( అవసరాన్ని బట్టి ) పరీక్ష నిర్వహిస్తుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్ధులకి స్కొర్ కార్డ్ కేటాయిస్తారు. ఆయా బ్యాంక్ లు ఉద్యోగప్రకటన ఇచ్చినప్పుడు ఈ స్కొర్ కార్డ్ మరియు తమ వ్యకిగత వివరాలతో అభ్యర్ధులు తమ దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ తమ నియామక పద్దతి ని అనుసరించి (వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్......) అభ్యర్ధిని నియమించుకుంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. మొట్టమొదటి సారిగా ఈ పరీక్షకి నోటిఫికేషన్ వెలువడింది.
వివరములకు ఈ లంకె చూడండి
http://www.ibps.in/career_pdf/cwe_advt.pdf
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.