నేడు ఈ దేశము లో రోజు రోజు కూ ఉద్యొగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ రంగములో అయితే మరీ శరవేగముగా తగ్గుతున్నాయి. కానీ, స్వయం ఉపాధి కి మాత్రం నిరంతరం అవకాశాలు ఉంటాయి. దీనిలో మన కష్టం సరి అయిన మార్గం లో ఉంటూ, నిజాయితీగా పని చేస్తూ ఉంటే విజయం సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
స్వయం ఉపాధి అనగానే మనకి గుర్తుకి వచ్చేవి పెట్టుబడి,బ్యాంక్ లోన్ చేయవలసిన ప్రాజెక్ట్ / వ్యాపారం దాని గురించి అవగాహన దాని నిర్వహణ లో వచ్చే సమస్యలని అధిగమించడం లాభాలని పొందడం ఇదే. చూడటానికి చదవటానికి చాలా సులభం అనిపించినా అన్ని వేళలా అంత సులభం కాదు. అలాగని అసాధ్యం కాదు. దీనికి కావలసింది నిజాయితీ, అకుంఠిత దీక్ష . ఈ రెండూ ఎవరికి వారు చేయవలసినవే . మిగిలిన విషయాల గురించి వాటి మీద అవగాహన . స్వయం ఉపాధి కి సంభందించిన బ్యాంక్ లోన్ పొందడం గురించి నెమ్మదిగా చర్చిద్దాం.