వచ్చిన వారు

Sunday, December 19, 2010

స్వయం ఉపాధి - PMEGP - 2

    
ఋణము తీసుకోబోయే లబ్దిదారులు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచెయ్యాల్సి ఉంటుంది. దీనిని Entrepreneurship Development Programme (EDP)  అంటారు. ఆర్ధిక వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, పరిశ్రమ యొక్క ఉత్పాదన, దాని మార్కెటింగ్ పై అవగాహన కల్పించడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం. దీనిని KVIC, KVIB శిక్షణా కేంద్రాల ద్వారా నిర్వహిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఈ శిక్షణ ఋణ మంజూరు కి ముందు గానీ, మంజూరు అయిన 12 నెలల లోపు గానీ పూర్తిచెయ్యాలి. ఆ  శిక్షణ పూర్తిచెయ్యని అభ్యర్ధులు  సబ్సిడీ  సహాయానికి అర్హులు కారు.

సబ్సిడీ అంటే ప్రభుత్వ సహాయం . ఇది ప్రాజెక్ట్ వ్యయం లో 15 నుంచి 35 శాతం దాకా  ఉంటుంది. అభ్యర్ది తన వాటాగా ( మార్జిన్) 5 నుంచి 10 శాతం పెట్టుబడి పెట్టాలి .  మిగిలింది బ్యాంక్ వారి  ఋణ సహాయం.

ఈ విధంగా ఋణము మంజూరు అయిన తర్వాత అభ్యర్ధి  తమ వాటా మొత్తాన్ని  (మార్జిన్) బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యాలి. ఈ మొత్తము జమ చేసిన తర్వాత బ్యాంక్ వారు ఋణ  సహాయాన్ని విడుదల చేస్తారు. ఇది  పూర్తి మొత్తం కావచ్చు లేక దఫ దఫాలు గా చెయ్యవచ్చు  ప్ర్రాజెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
  
ఋణ మంజూరు అయిన తర్వాత బ్యాంక్ సబ్సిడీ మొత్తాన్ని నోడల్ బ్రాంచ్ నుంచి విడుదల చెయ్య వలసిందిగా కోరుతుంది   . ఈ విధంగా వచ్చిన సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్  3  సంవత్సరాల కాలపరిమితి తో  ఖాతా లో జమ చేస్తుంది. దీని మీద  ఎటువంటి వడ్డీ ఇవ్వబడదు. అదే విధం గా ఋణం పై వడ్డీ లెక్కించేటప్పుడు ఈ సబ్సిడీ మొత్తాన్ని వడ్డీ లెక్కింపు నుంచి మినహాయిస్తారు. ఖాతా ముగించేటప్పుడు ఈ మొత్తాన్ని ఆఖరు వాయిదా గా భావిస్తారు. సబ్సిడీ కేవలం కొత్త ప్రాజెక్త్స్  PMEGP పధకం క్రింద మంజూరు అయిన ఋణాలకి మాత్రమే వర్తిస్తుంది . 

దరఖాస్తు , ఇంకా వివరాలు కావల్సిన వారు సంప్రదించవచ్చు. .