వచ్చిన వారు
Sunday, December 19, 2010
స్వయం ఉపాధి - PMEGP - 2
ఋణము తీసుకోబోయే లబ్దిదారులు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచెయ్యాల్సి ఉంటుంది. దీనిని Entrepreneurship Development Programme (EDP) అంటారు. ఆర్ధిక వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, పరిశ్రమ యొక్క ఉత్పాదన, దాని మార్కెటింగ్ పై అవగాహన కల్పించడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం. దీనిని KVIC, KVIB శిక్షణా కేంద్రాల ద్వారా నిర్వహిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఈ శిక్షణ ఋణ మంజూరు కి ముందు గానీ, మంజూరు అయిన 12 నెలల లోపు గానీ పూర్తిచెయ్యాలి. ఆ శిక్షణ పూర్తిచెయ్యని అభ్యర్ధులు సబ్సిడీ సహాయానికి అర్హులు కారు.
సబ్సిడీ అంటే ప్రభుత్వ సహాయం . ఇది ప్రాజెక్ట్ వ్యయం లో 15 నుంచి 35 శాతం దాకా ఉంటుంది. అభ్యర్ది తన వాటాగా ( మార్జిన్) 5 నుంచి 10 శాతం పెట్టుబడి పెట్టాలి . మిగిలింది బ్యాంక్ వారి ఋణ సహాయం.
ఈ విధంగా ఋణము మంజూరు అయిన తర్వాత అభ్యర్ధి తమ వాటా మొత్తాన్ని (మార్జిన్) బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యాలి. ఈ మొత్తము జమ చేసిన తర్వాత బ్యాంక్ వారు ఋణ సహాయాన్ని విడుదల చేస్తారు. ఇది పూర్తి మొత్తం కావచ్చు లేక దఫ దఫాలు గా చెయ్యవచ్చు ప్ర్రాజెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
ఋణ మంజూరు అయిన తర్వాత బ్యాంక్ సబ్సిడీ మొత్తాన్ని నోడల్ బ్రాంచ్ నుంచి విడుదల చెయ్య వలసిందిగా కోరుతుంది . ఈ విధంగా వచ్చిన సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ 3 సంవత్సరాల కాలపరిమితి తో ఖాతా లో జమ చేస్తుంది. దీని మీద ఎటువంటి వడ్డీ ఇవ్వబడదు. అదే విధం గా ఋణం పై వడ్డీ లెక్కించేటప్పుడు ఈ సబ్సిడీ మొత్తాన్ని వడ్డీ లెక్కింపు నుంచి మినహాయిస్తారు. ఖాతా ముగించేటప్పుడు ఈ మొత్తాన్ని ఆఖరు వాయిదా గా భావిస్తారు. సబ్సిడీ కేవలం కొత్త ప్రాజెక్త్స్ PMEGP పధకం క్రింద మంజూరు అయిన ఋణాలకి మాత్రమే వర్తిస్తుంది .
దరఖాస్తు , ఇంకా వివరాలు కావల్సిన వారు సంప్రదించవచ్చు. .
Subscribe to:
Post Comments (Atom)
రామ్ గారు, చాలా విషయాలు చెపుతున్నారు ,చాలా సంతోషం.
ReplyDeleteఈ పధకం గురించి ఇంకా వివరాలు కావాలి. వివరాలు ఇ మెయిల్ చేయగలరా? rmaturi@bighelp.org
I liked the details about the milk processing unit. I am exploring some of these opportunities. These details will help me a lot.
Thanks
ravi
రవి గారు,
ReplyDeleteమీకు కావలసిన వివరాలు PMEGP గురించా? Milk Processing Unit గురించా? please clarify.
మైథిలి రామ్ గారు, PMEGP గురించి.
ReplyDeleteI really liked all the information you are giving. I hope that will help me set up a plant.
Finding a good opportunity is as difficult as making that opportunity work for us.
Thanks
Ravi
Shri Ravi garu,
ReplyDeleteI am glad to know that the information may be useful to you.
I will send you a mail. let us discuss through email / chat.
thank you
Mythiliram.
Ravi garu PMEGP gurinchi telugu leda English lo Emaina brouchers unte pls mail cheyaglaru "udayclear336@gmail.com...
ReplyDeleteసర్,నాకు డైరీఫార్మ్ పెట్టడానికి సంబంధించిన msme సమాచారం కావాలి,దయచేసి మెయిల్ చేయగలరు
ReplyDeleteధన్యవాదాలు
arepallisathibabu@gmail.com
PMEGP ద్వారా డైరీఫామ్ స్యార్ట్ చేయవచ్చా వివరాలు తెలుపగలరు
ReplyDeletearepallisathibabu@gmail.com
hi sir my name is surya
ReplyDeletesir please tell me full details pmegp details and ground nut decordicator. bussiness about
రామ్ గారు PMEGP గురించి పూర్తి వివరాలు చెప్పండి నా మెయిల్ murakondanarendra@gmail.com
ReplyDeletePMEGP గురించి వివరాలు తెలియజేయండి సార్, నా మెయిల్ ఐడీ phaneendramancha@gmail.com
ReplyDeleteSir pmegp Lo chicken poultry ki loan avakasam vundha?
ReplyDeleteHello sir na pairu kondallreddy nenu handeceped sir pmegp krindha loan pondhe light weight bricks thayaru chadham anukontunnanu naku pmegp,bricks gurenchi details eevagalara plz.......cell-9492673310
ReplyDeletesir we already apply loan in standup india scheme,we elgible to pmegp scheame
ReplyDeleteNamaste to all,
ReplyDeleteTHere were some changes in PMEGP etc. Shortly will update the details
సార్ నాకు సొంతంగా 25పాడి పశువులతో పశుపోషణ స్టార్ట్చేసి వాటి పాలు ద్వారా మంచి ఆదాయం ఆర్జించాలని నా నిరుద్యోగ సమస్య పోగొట్టుకుని సమాజంలో గౌరవంగా
ReplyDeleteబ్రతకాలని నాఆశ దయచేసి లోనుగురించి వివరాలు తెలపగలరు
సార్ నేను రైస్ అండ్ జనరల్ స్టార్ స్టార్ చేయాలి అనుకుంటున్నాను అందుకు PMEGP నుంచి లోన్ పొందాలి అది ఎలా పొందలో పూర్తిగా వివరించి నాకు సహాయం చదవండి
DeletePlease send me your eMail Id / Phone number...
DeleteSir nenu maa inti daggera kiraana & Xerox shop own ga start cheyaali anukunnanu loan details cheppandi
ReplyDeleteSir good evening nenu manufacture business start cheyali anukuntuna pmegp full details
ReplyDelete