వచ్చిన వారు

Showing posts with label వ్యవసాయం. Show all posts
Showing posts with label వ్యవసాయం. Show all posts

Friday, December 14, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 3


పసుపుకొమ్ములు సేకరించాక వాటిని ఆరబెట్టి , తుడిచి శుభ్రం చేస్తారు. 
తర్వాత వాటిని ఒక డ్రమ్ లో వేసి యంత్ర సహాయంతో తిప్పుతారు. దీని
వలన పైన ధూళి అంతా పోయి శుభ్రమవుతుంది. తర్వాత వాటిని గ్రేడింగ్

Thursday, December 13, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 2

ఇంతకు ముందు టపాలో  చెప్పిన్నట్లు గా ఈ రంగంలోని పరిశ్రమల గురించి  ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా చుద్దాం. 


Sunday, October 28, 2012

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 7


మిల్క్ ప్రొసెసింగ్ గురించి నాకు వచ్చిన ఈ మెయిల్స్ ను చూసాక ఈ రంగం గురించి మరి కొచెం విగా
...


Friday, October 26, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 1

        మన దేశ  ప్రజలలో 70 % వ్యవసాయం మీద ఆధారపడ్డా, జిడిపి లో వ్యవసాయం రెండు శాతం మాత్రమే. మన నాయకుల పుణ్యామా అని నేడు వ్యవసాయం, పేదరికం రెండూ పర్యాయపదాలు అయిపోయాయి. ఈ వ్యవసాయానికి విలువ ఆధారితాలని జోడించడం ద్వారా వ్యవసాయానికి  వివిధ పరిశ్రమలకి, రైతులకి మంచి ఆదాయం వస్తుంది. 

Friday, September 14, 2012

సేంద్రియ వ్యవసాయము - భారత ప్రభుత్వ సబ్సిడీ పధకములు...


సేంద్రియ వ్యవసాయము ను ప్రొత్సాహించడానికి భారత ప్రభుత్వము Capital Investment subsidy scheme for  commercial production units of organic inputs అనే పధకము ద్వారా  సబ్సిడీ ని అందిస్తుంది. దాని గురించి వివరాలు

Wednesday, August 8, 2012

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 2

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 2

వెర్మి కల్చర్ యూనిట్ స్థాపనకు, అయ్యే వ్యయం మరియు వచ్చే లాభం గురించిన వివరాలు ఇప్పుడు  

Sunday, August 5, 2012

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 1

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 1
            
              ఈ రొజులలో  బాగా ఎక్కువగా వినిపిస్తున్న వ్యవసాయ విదానము సేంద్రియ వ్యవసాయము ( Organic Farming). నిజానికి ఇది మన దేశానికి కొత్త కాదు. రసాయన ఎరువులు, మందుల ధాటికి  మరుగున పడి, మళ్ళీ మన పూర్వ వైభవం దిశగా నడుస్తున్న వ్యవసాయ విదానమే మన సేంద్రియ వ్యవసాయము.

Sunday, July 29, 2012

స్వయం ఉపాధి: పుట్టగొడుగుల (మష్రూమ్) ఉత్పత్తి -1

పుట్టగొడుగుల ఉత్పత్తి - 1

పుట్ట గొడుగులు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. దీని వలన పెంచినవారికి ఆదాయము, తిన్న వారికి పౌష్టికాహారము లభిస్తాయి. ఈ వ్యాపారము / వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగిన వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. దీని వాడకము ప్రస్తుతము పట్టణాలలో ఎక్కువగానే ఉంది. నెమ్మదిగా విస్తరిస్తోంది. దీనిని శాకాహారము గా భావించడం వలన కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.

Friday, August 12, 2011

అన్నదాత ఆవేదన ... తీర్చే మార్గాలు సూచించండి.


కోనసీమ రైతులు సంఘఠితమై ప్రకటించిన పంట విరామం ( Crop Holiday ) గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అన్నం పెట్టే రైతు తానిక పెట్టనని చెప్పడానికి ఎవరు బాధ్యులు ?  రైతుల ఆత్మహత్యలు కూడా రాజకీయం చేస్తున్న మన రాజకీయనాయకులా ? కనీసం బియ్యంబస్తా తెచ్చుకుంటున్నప్పుడు కూడ పంట పండించే రైతు కష్టనష్టాల గురించి ఆలోచించని ప్రజలదా....?

కారణాలు ఏవైనా రైతన్న అలిగాడు . వ్యవసాయాన్ని నమ్ముకోవడమే తప్ప అమ్ముకోవడం చేతగాని మన అన్నదాత పంట విరామం ప్రకటించి మార్పు కోసం ఎదురుచూస్తున్నాడు. విరామం వలన రైతుకేమీ ఆనందం రాదు. అల్లరి పిల్లలకి అన్నం పెట్టనని బెదిరించి ఆకాసేపు అమ్మ ఎంత బాధ పడుతుందో అంతకన్నా ఎక్కువ బాధనే  పడుతున్నాడు. ఇలాగైనా వ్యవసాయాన్ని బ్రతికిదామని తాపత్రయపడుతున్నాడు.

ఈ విషయం మీద చిరుదీపం అందరినీ చర్చ కి అహ్వానిస్తొంది . సమస్య ఎక్కడ మొదలైంది .. మీరైతే ఏం చెప్తారు.

       



                   
   
     

Thursday, May 26, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 6

Khoa Processing  Unit


రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము లో 300-400 లీటర్లు Khoa కోసం కేటాయించు కొంటే మంచిది. దీనికి .....


Capital Investment

01. Building 100 Sq.Ft
02. Equipment for dessication  and others  కి సుమారు గా Rs. 50,000/- దాకా అవుతుంది.

            
రోజు కి variable cost  సుమారు గా Rs. 12,000/- దాకా అవుతుంది
రోజు కి ఆదాయము (75 kgs Khoa @Rs.175/- per Kg )   సుమారు గా Rs. 13125/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము   సుమారు గా Rs. 1,000/- దాకా వస్తుంది



 PANEER Processing Unit

రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము లో 300-400 లీటర్లు Paneer కోసం కేటాయించు కొంటే మంచిది. దీనికి .....

Capital Investment

01. Building 150 Sq.Ft
02. Refrigeration units, bhatti and others
  కి సుమారు గా 
Rs. 1,50,000/- దాకా అవుతుంది.
            
రోజు కి variable cost  సుమారు గా Rs. 8,500/- దాకా అవుతుంది
రోజు కి ఆదాయము (50 kgs Paneer  @Rs.200/- per Kg )   సుమారు గా Rs. 10,000/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము   సుమారు గా Rs. 1,500/- దాకా వస్తుంది
  
       
            
        
   

Wednesday, May 25, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 5

Setting Up Creamery Unit


ఇంతకు ముందరి పోస్ట్ ల లో Milk Processing Unit with minimum capacity  గురించి చర్చించాము.  అయితే రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము ఉంటే మిగిలిన ఉత్పత్తులు (Creamery, Khoa Processing,Paneer etc) లాభసాటిగా చేయవచ్చు. ఇందులో Creamery Unit గురించి  ఈ టపాలో ...

Capital Investment

01. Building 240 sQ.Ft
02. Cream separator 500liters/hr
03. Ghee Boiling Vat 

04. Gas Burner
05. High power regulator for burner
06. Weighing balance
07. Containers 100 ltr capacity 3 numbers (for cream storage)
08. Buckets, spatula , G.I drum and miscellaneous items


సాధారణంగా పైన చెప్పినవి కావాలి.వాటి కి సుమారు గా Rs. 2,00,000/- దాకా అవుతుంది.
            రోజు కి variable cost  సుమారు గా Rs. 23,000/- దాకా అవుతుంది
            రోజు కి ఆదాయము   సుమారు గా Rs. 25,000/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము   సుమారు గా Rs. 2,000/- దాకా వస్తుంది

 
         
        
          




Tuesday, May 3, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 4

మిల్క్ ప్రొసెస్సింగ్ యూనిట్ లో వాడే మెషినరీ వివరాలు కొందరు అడిగినందువలన ఆ వివరాలు వ్రాస్తున్నాను.
The machinery should be made of good quality stainless steel.

 Details of Machinery :


1. Building 300 - 500 s.qft floor area Rent/ Own
2. Double jacketed vat for heating milk  (Stainless steel - 250 lts capacity )
3. Bulk cooler
4. Refrigeration Unit
5. Cream separator
6. Weighing machine
7. Sealing machine
8. Fat testing machine
9. Cans, plastic containers etc. 

ఈ మొత్తం మెషినరీ  (500 lts per day ) కి ఇంచుమించుగా  
Rs. 2,50,000.00  అవ్వవచ్చును.
Variable cost + Fixed expenses per day Rs. 13,500.00

Profit per day Rs. 1500 (approx)  


వ్యాపార విస్తరణకి ఈ యూనిట్ కి అనుబధంగా తయారు చేసే ఉత్పత్తుల గురించి ( కోవా , ఐస్ క్రీం ........) తరువాతి టపాలలో తెలుసుకుందాము.
      
       
        

Tuesday, April 26, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 3 ( వచ్చే లాభమెంత ..? )

ఈ టపా ముందు భాగాలు స్వయంఉపాధి / వ్యవసాయం లేబుల్స్ లో చూడవచ్చు.


వచ్చే లాభమెంత ..?

ఉదాహరణకి ఒక 500 లీటర్ల పాల ప్రొసెస్సింగ్ ప్లాంట్ కి ఏఏ వసతులు కావాలి, ఎంత పెట్టుబడి కావాలి ఎంత లాభం వచ్చే అవకాశం ఉందో ఈ టపాలో చర్చిద్దాం.

ప్లాంట్, మౌలికవసతులు గల( రోడ్.నీరు మొదలైన సదుపాయాలు) గల ఒక మేజర్ పంచాయితీలో పెట్టగలిగితే మంచిది. పాల యొక్క ధర నిర్ణయం FAT / SNF  పరీక్ష ద్వారా నిర్ణయించాలి. ఈ  షరతులు పాటించి వ్యయ నిర్ణయం లాభనిర్ణయం జరిగిందని గమనించండి.  

ప్లాంట్ కి కావలసిన యంత్రసామాగ్రి వీటినే స్థిర ఆస్థులు గా చెప్పవచ్చు  ఉదాహరణకి బరువు తూచే యంత్రం , Bulk Cooler, Refrigeration unit, Cream Separator, Fat testing machine... మొదలైనవి  వీటికి సుమారుగా 2,50,000 రూపాయలు  అవుతుంది.( ఇందులో భవనం అద్దె కలుపలేదు).

పాల కొనుగోలు, సిబ్బంది జీతాలు మొదలైన చర ఖర్చులకి  రోజుకి సుమారుగా 13,200   రూపాయలు అవుతుంది. దీనికి బ్యాంక్ వడ్డీ, తరుగుదల వంటివి కలిపితే 13,500  రూపాయలు అవుతుంది.

పాలు, వెన్న అమ్మకము ద్వారా రొజుకు   15,000 రూపాయలు దాకా ఆదాయము వస్తుంది. అంటే రొజుకు  1500 రూపాయలు లాభం.

ఇవి కాక నిలువ ఉండే పనీర్,  నెయ్యి మొదలైన అదనపు ఉత్పత్తులు చెయ్యగలిగితే  మరింత వ్యాపారం విస్తరిస్తుంది.

పాలు సంపూర్ణపోషకాహారం అంటారు. పసిపిల్లలు , రోగులు, గర్భిణీలు, ఎక్కువగా ఆధారపడే పాలు అమ్మకంలో నాణ్యత పాటించండి.శుభ్రత ని పాటించండి.  ఆరోగ్యాలకి హాని చేసే రసాయనాలు కలపకండి. మీరు పాటించే విలువలు మీ వ్యాపారానికి ప్రధమ పెట్టుబడి. వినియోగదారుని విశ్వాసం చూరకొనటమే అసలైన లాభార్జన.

బ్యాంక్ ఋణము కావలసిన వారు ఇంతకు ముందు వ్రాసిన PMEGP 1 , PMEGP- 2 టపాలు చూడండి.

మరిన్ని ఋణ పథకాలు తరవాత టపా లలో తెలియచేస్తాను. మిల్క్ ప్రొసెస్సింగ్ లో మరిన్ని ఉపాధి అవకాశాలని కూడా తరువాత టపా లలో తెలుసుకుందాము.
               
               


        

Sunday, April 24, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 2

       సంస్థ లాభాలలో పయనించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటిలో ముఖ్యమైనది ప్లాంట్ స్థాపించే స్థల నిర్ణయం . ప్లాంట్ పాలు సేకరించుకోడానికి మరియు వాటిని మార్కెట్ చెయ్యడానికి అనువుగా ఉండాలి . అంటే ఎంచుకునే స్థలం అటు పాల అమ్మకందారులకి ఇటు మన వినియోగదారులకి దగ్గరగా ఉండేలా ఎంచుకోవడము గనుక సాధ్యపడితే రవాణా ఖర్చులు కలసి వస్తాయి. రోజుకి 500 లీటర్ల  పాలు ప్రోసెస్ చెయ్యడానికి సుమారుగా 300 నుండి 500 చదరపు అడుగులు వైశాల్యం ఉన్న  భవనం ( ఇల్లు/దుకాణం )  సరిపోతుంది. గాలి, వెలుతురు , నీటివసతి,  శుభ్రపరచడానికి అనువైన ఫ్లోరింగ్ అవసరం.
 

        ప్లాంట్ పెట్టాలనుకున్న ప్రదేశానికి చుట్టుపక్కల గల పాడి పశువులు శాతం ఎంతవరకు ఉన్నది, వాటి వయస్సు, జాతి, అంటే  పాల లభ్యత ఏవిధంగా ఉందో తెలుసుకోవాలి. 
        పాల వ్యాపారులు/రైతులు పాలని ఏవిధంగా విక్రయిస్తున్నారు ఏ రేటుకి విక్రయిస్తున్నారో తెలుసుకోవాలి . పాల యొక్క నాణ్యత పరిక్షించుకోవాలి.
ప్లాంట్ పెట్టాలనుకునే ఔత్సాహికులకి ఎవరికైనా ఈ విషయం గా మరింత సమాచారం కావాలంటే కామెంట్ ద్వారా సంప్రదించవచ్చు.


వచ్చే టపాలో లాభం,  బ్యాంక్ ఋణం గురించి తెలియచేస్తాను. 

           
            
         

Saturday, April 23, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ 1

     యువతరంకి ఎదిగే అవకాశం  ఉన్న రంగాలలో పాల ప్రాసెస్సింగ్  ఒకటి.   ఈ రంగంలో స్వయంఉపాధి అవకాశాలు వినియోగించుకుని స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలని అర్జించవచచ్చును నలుగురికి ఉపాధి కల్పించవచ్చు.
         
     పాల ఉత్పత్తిలో భారతదేశము మిగిలిన దేశాలన్నిటి కన్నా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఒక సర్వే ప్రకారం దేశ జనాభా లో 25% మంది ప్రత్యక్షంగా  20%   పరోక్షంగా పాల మీద,  పాల ఉత్పతుల మీద వచ్చే ఆదాయం మీద   ఆధారపడి జీవిస్తున్నారు. ఇదివరకులా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు  పాకేజ్డ్ పాల కి ప్రాధాన్యత ఇస్తున్నారు.  పాల ఉత్పత్తుల వాడకం కూడా ఇదివరకు మీద ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చిన్న వ్యాపారస్థులు పాలని నిలువ ఉంఛే సామర్ధ్యం లేకపోవడం వలన పాలు పాడై పోయి నష్టపోతున్నారు. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటొంది. ఈ కాలంలో కాలరీత్యా  వచ్చే కొరతకి ఈ నష్టం తోడవ్వడం వలన అటు వాడుకదారులు ఇబ్బంది పడుతున్నారు ఇటు  పాల వ్యాపారులు నష్టపోతున్నారు. 

             మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్  ద్వారా పాలు నిలువ ఉండే సామర్ధ్యం పెరుగుతుంది. తద్వారా పాలు పాడవడం వలన వచ్చే నష్టాన్ని నివారించవచ్చు మిగిలిన పాలతో పచ్చికోవా , పన్నీరు, పెరుగు , సుగంధి  పాలు మొదలైన వాటి తయారీ ద్వారా అదనపు ఆదాయం  పొందవచ్చు. అయితే ఈ పాల ఉత్పత్తిల కి ఎంత  మేరకు ఆదరణ ఉందన్న సందేహం రావచ్చు. ప్రజల పాలు, పాల ఉత్పత్తుల  వినియోగం ఇలా ఉంది. 
             పెరుగు -
7%
             కోవా - 7%
             వెన్న - 6.5%
             నెయ్యి - 27.5%
             పనీర్ - 7%
             పాలు - 45 %.

       ఈ రంగంలో  ఔత్సాహిక వ్యాపారవేత్తలకి స్వయంఉపాధి  అవకాశాలు మిక్కుటం గా ఉన్నాయి. ప్రకృతి, సర్కారు దెబ్బలతో అల్లాడుతున్న  వ్యవసాయదారులు కూడా కొద్ది పెట్టుబడి తో 
మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్  స్థాపించుకోగలితే స్థిరమైన ఆదాయం పొందవచ్చును.  ఈ వ్యాపారంలో  కనీసం Rs. 2.50 లక్షల పెట్టుబడి పెడితే నెలకి Rs.45,000 వరకు  ఆదాయం పొందే అవకాశం ఉంది.
  

    ఈ  వ్యాపారం లో వచ్చే లాభాల వివరాలు, స్థాపనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిశీలించవలసిన / దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు, బ్యాంక్ ఋణం ఎంతమేరకు ఏవిధంగా లభిస్తుందో వచ్చే టపాలలో తెలియచేస్తాను.
             

           

   

Saturday, February 19, 2011

సేంద్రీయ ఉత్పత్తులని( Organic Products ) వాడట్లేదా? అయితే ఒక్కసారి ఇది చదవండి

             రసాయన ఎరువులు , పురుగుమందులు విచక్షణా రహిత౦గా వాడటం వలన తాత్కాలికంగా ఉత్పత్తి అయితే పెరగవచ్చు కానీ దీర్ఘకాలికంగా చూస్తే అటు భూసారాన్ని , ఇటు మానవాళి ఆయువుని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు , గర్చస్థ శిశువుల ఆరోగ్యాల మీద వీటి ప్రభావం ఎంతైనా వు౦ది. కొన్ని రకాల కేన్సర్లు , లుకేమియా వంటి ప్రాణాంతక జబ్బులు , కాలెయ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా 7 నుంచి  14 సంవత్సరాల పిల్లల్లో ఈ వ్యాధుల బారిన పడే శాతం ఎక్కువ  అయ్యింది.. గర్భస్థ శిశువులలో పుట్టుకతో ఏర్పడే అవయవ లోపాలే కాకుండా ఎదుగుదల మీద కూడా ఈ కాలుష్య పూరిత ఆహార ప్రభావం ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చును. కాలుష్య పూరిత ఆహార ప్రభావం వీరి మీదనే కాదు, అన్ని వయసుల వారి మీద ఉంటుంది. రోగనిరధక శక్తి తగ్గిపోవడం , వ్యంధ్యత్వం , ఇలా చాలారకాలు గా వీటి ఫలితాలు ఉంటున్నాయి.


            సేంద్రీయ ఉత్పత్తులని( Organic Products ) మన ఆహారంలో భాగం చెయ్యడం ద్వారా ఈ ముప్పు ను౦చి చాలా వరకు తప్పించుకోవచ్చు .సేంద్రీయ ఉత్పత్తులు వాడటం వలన కేవలం ఆరోగ్య పరిరక్షణే కాదు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. 


            హరిత విప్లవం ద్వారా పెంచుకున్న ఉత్పత్తి రేటు స్థిరం గా ఉండిపోయింది. సేంద్రీయవ్యవసాయపద్ధతులు అమలు చేయడం వలన  ఉత్పత్తి శాత౦ పెంచుకోవచ్చు. నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుంది. సేంద్రీయవ్యవసాయఉత్పత్తులలో పీచు పధార్ధం అధిక శాతం లో ఉంటుంది. ప్రకృతి సంబంధమైన ఎరువులని వాడటం వలన భూసారం దెబ్బ తినదు. తద్వారా భూగర్భ జలాలు కూడా కలుషితం కావు. సేంద్రీయవ్యవసాయపద్ధతి లో వ్యవసాయానికి నీటి వనరులు కూడా ఆదా అవుతాయి. ఎరువుల కై పశుపోషణ చెయ్యడం వలన పాడి రూపం లో రైతుకి అదనపు ఆదాయం సమకూరుతుంది. సహజం గా లభించే వ్యర్ధాలు ఎరువులుగా , పురుగు మ౦దులుగా వాడట౦ వలన రైతుపై ఆర్ధిక౦గా అదనపు భారం తప్పుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయవ్యవసాయఉత్పత్తుల కి ఏటా 10% వరకు మార్కెట్ పెరుగుతో౦ది.  సేంద్రీయవ్యవసాయం మన దేశానికి క్రొత్త కాదు. మరుగున పడింది. దీనిని ఆదరించాల్సిన బాద్యత మన అందరిదీ. 
                


                సేంద్రీయవ్యవసాయం వలన ప్రయోజనం ఒక్క వ్యవసాయదారునికే కాదు. మన అందరికీ కూడా.


                సేంద్రీయవ్యవసాయఉత్పత్తులని ప్రోత్సహించండి. భూసారాన్ని, భావితరాలని కాపాడండి.
                
                  
ఈ రంగం లో ఉన్న వ్యాపార , ఉద్యోగ అవకాశాలు మరోసారి  .....................