వచ్చిన వారు

Thursday, December 13, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 2

ఇంతకు ముందు టపాలో  చెప్పిన్నట్లు గా ఈ రంగంలోని పరిశ్రమల గురించి  ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా చుద్దాం. 


వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో పసుపు , మిరప ఉత్పత్తుల ప్రోసెసింగ్ ని విడివిడిగా చేసి లాభాలను పొందుతున్న వ్యవసాయ / వ్యాపారస్తులు ఉన్నప్పటికీ ఈ రెండూ కలిపి ఎన్నుకోమని ఈ రంగంలోని నిపుణులు  ఔత్సాహికులకి సలహా ఇస్తారు. 
మనదేశంలో ఈ రెండు పంటలకి సంబంధించిన మార్కెట్ అతి పెద్దది. 
భారతీయ జీవన విధానంలో ఆహారపరంగానూ, వైద్యపరంగానూ పసుపుకి 
పెద్ద స్థానమే ఉంది. పసుపు, మిరప మన వంటల్లో ఎక్కువగా వాడే 
నిత్యావసర దినుసులలో ఒకటి అని చెప్పచ్చు. ఈ రెండు దినుసులు 
గృహావసరాలలో మత్రమే కాకుండా వ్యాపార సంస్థలకి కూడా 
అవసరపడతాయి. వ్యాపార ధృక్పథంతో పచ్చళ్ళు , పొడులు , మొదలగు 
ఆహార ఉత్పత్తులని తయారుచేసే సంస్థలకి కూడా వీటి అవసరం వుంటుంది. 

విస్తారమైన మార్కెట్ అవకాశాలు ఉన్న ఈ రంగంలో అవకాశాలని 
అందిపుచ్చుకోవాలంటే శ్రమ, నిజాయితీ అవసరం. కొత్తగా ఈ రంగంలోకి 
వచ్చిన సంస్థలు,  చిన్నపెట్టుబడిదారులు  సెమి అర్బన్ ప్రాంతాల నుంచి 
మొదలు పెడితే సులభంగా మార్కెట్ ని అందుకోవచ్చును. మార్కెట్ ఎక్కువ వలన లాభావకాశాలు సహజంగానే ఎక్కువగా  వుంటాయి.
ఈ పరిశ్రమని స్థాపించాలంటే Food safety and standard regularity  వారి 
నుంచి ధ్రువీకరణ పత్రం ( లైసెన్సులు) పొందాల్సి వుంటుంది. దీనితో పాటు ISI, ISO, AGMARK వంటి గుర్తింపులు బ్యాంక్ నుంచి ఋణం పొందటం 
లోనూ, మార్కెటింగ్ లోనూ ఉపయోగపడతాయి. 


  
   
 

No comments:

Post a Comment