యువతరంకి ఎదిగే అవకాశం ఉన్న రంగాలలో పాల ప్రాసెస్సింగ్ ఒకటి. ఈ రంగంలో స్వయంఉపాధి అవకాశాలు వినియోగించుకుని స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలని అర్జించవచచ్చును నలుగురికి ఉపాధి కల్పించవచ్చు.
పాల ఉత్పత్తిలో భారతదేశము మిగిలిన దేశాలన్నిటి కన్నా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఒక సర్వే ప్రకారం దేశ జనాభా లో 25% మంది ప్రత్యక్షంగా 20% పరోక్షంగా పాల మీద, పాల ఉత్పతుల మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇదివరకులా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు పాకేజ్డ్ పాల కి ప్రాధాన్యత ఇస్తున్నారు. పాల ఉత్పత్తుల వాడకం కూడా ఇదివరకు మీద ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చిన్న వ్యాపారస్థులు పాలని నిలువ ఉంఛే సామర్ధ్యం లేకపోవడం వలన పాలు పాడై పోయి నష్టపోతున్నారు. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటొంది. ఈ కాలంలో కాలరీత్యా వచ్చే కొరతకి ఈ నష్టం తోడవ్వడం వలన అటు వాడుకదారులు ఇబ్బంది పడుతున్నారు ఇటు పాల వ్యాపారులు నష్టపోతున్నారు.
మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ ద్వారా పాలు నిలువ ఉండే సామర్ధ్యం పెరుగుతుంది. తద్వారా పాలు పాడవడం వలన వచ్చే నష్టాన్ని నివారించవచ్చు మిగిలిన పాలతో పచ్చికోవా , పన్నీరు, పెరుగు , సుగంధి పాలు మొదలైన వాటి తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అయితే ఈ పాల ఉత్పత్తిల కి ఎంత మేరకు ఆదరణ ఉందన్న సందేహం రావచ్చు. ప్రజల పాలు, పాల ఉత్పత్తుల వినియోగం ఇలా ఉంది.
పెరుగు - 7%
కోవా - 7%
వెన్న - 6.5%
నెయ్యి - 27.5%
పనీర్ - 7%
పాలు - 45 %.
ఈ రంగంలో ఔత్సాహిక వ్యాపారవేత్తలకి స్వయంఉపాధి అవకాశాలు మిక్కుటం గా ఉన్నాయి. ప్రకృతి, సర్కారు దెబ్బలతో అల్లాడుతున్న వ్యవసాయదారులు కూడా కొద్ది పెట్టుబడి తో మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ స్థాపించుకోగలితే స్థిరమైన ఆదాయం పొందవచ్చును. ఈ వ్యాపారంలో కనీసం Rs. 2.50 లక్షల పెట్టుబడి పెడితే నెలకి Rs.45,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఈ వ్యాపారం లో వచ్చే లాభాల వివరాలు, స్థాపనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిశీలించవలసిన / దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు, బ్యాంక్ ఋణం ఎంతమేరకు ఏవిధంగా లభిస్తుందో వచ్చే టపాలలో తెలియచేస్తాను.