సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 1
ఈ రొజులలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న వ్యవసాయ విదానము సేంద్రియ వ్యవసాయము ( Organic Farming). నిజానికి ఇది మన దేశానికి కొత్త కాదు. రసాయన ఎరువులు, మందుల ధాటికి మరుగున పడి, మళ్ళీ మన పూర్వ వైభవం దిశగా నడుస్తున్న వ్యవసాయ విదానమే మన సేంద్రియ వ్యవసాయము.
ఈ రంగం లో అనేక ఉద్యొగ, ఉపాధి అవకాశములు ఉన్నాయి. ఈ అవకాశాలు కేవలం వ్యవసాయ రంగంలోనే అనుకుంటే పొరపాటు. దీని అధారంగా అనేక వ్యాపార అవకాశాలు (విదేశాలకు ఎగుమతులతో సహా ) ఉన్నాయి.
ఈ విధానంలోని ఒక ముఖ్యమైన ప్రక్రియ వాన పాములను ఉపయోగించి ఎరువులను తయారు చేయడం ( vermi culture). దీని గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం.
వెర్మి కల్చర్
పశువుల కొట్టం లోంచి, డైరీ ఫార్మ్స్ లోంచి, వ్యవసాయపనులు
జరిగిటటప్పుడు కొన్ని వ్యర్ధాలు వస్తాయి. ఈ వ్యర్ధాలు ఎంతో విలువైన
జీవరసాయనాలు. ఇవి మందుల రసాయానాలల్లా భూమిలో సారం పీల్చేయవు. భూమి
సారవంతంగా మారటానికి ఈ రసాయానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చెత్త అని బయటపడేసి కాలుష్యానికి, దుర్గంధానికి కారణమయ్యే బదులు అదే చెత్త
ని సమర్ధం గా వినియోగించి వాటి నుంచి వచ్చే జీవ రసాయనాల సాయం తో
ఆరోగ్యవంతమైన అధికమైన ఉత్పత్తి సాధించడమే వెర్మి కంపోస్ట్ ఉద్దేశ్యం.
వానపాముల గురించి...
వెర్మి కంపోస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవలసినది వానపాముల గురించి.వానపాముల రకం భూమిని బట్టి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదపు 2500 వానపాము
రకాలు ఉండగా దాదాపు 500 రకాలు మన భారతదేశంలో లభ్యమవుతున్నాయి. మన భూమిలొ
ఏరకమైన వానపాలున్నాయో ముందు గుర్తించి కంపోస్ట్ చెయ్యాల్సి ఉంటుంది.వీటిని
ప్రత్యేకంగా పెంచవచ్చు లేదా కొన్ని పద్ధతులు ఉపయోగించి సులభంగా కంపోస్ట్
చెయ్యవచ్చు.
అసలు వానపాముల్ని ఎలా గుర్తించాలి ? ఎలా వృద్ధి చేయాలి ?
1. వ్యవసాయ భూమిని / తోటని కాని వానపాము జాడలకై పరిశీలన చెయ్యాలి. వానపాములు చేరుతున్న ప్రదేశాలని గుర్తించాలి.
2. .
వీటిని వృద్ధి చెయ్యడానికి బెల్లం మరియు ఆవుపేడని ( ఆవుపేడ నిలవది కన్నా
తాజా ది అయితే మంచి ఫలితాలు వస్తాయి) సమపాళ్ళల్లో తీసుకోవాలి. ఒక చదరపు
మీటరు భూమికి సుమారుగా 500గ్రా. బెల్లం మరియు 500గ్రా. తాజా ఆవుపేడ
సరిపోతాయి.
3.. రెండు లీటర్ల నీటిలో బెల్లాన్ని, ఆవుపేడని కరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యం కల భూమిపై జల్లాలి.
4. ఈ ప్రదేశాన్ని గడ్డితో కప్పివేసి పైన గోతాముని కప్పాలి.
5. ఈ గోతాము పైన 20 నుంచి 30 రోజుల వరకు నీళ్ళు జల్లాలి.ఈ స్థలంలో ఎపిజైక్, అనెసిక్ స్థానిక వానపాములు వృద్ధిచెందుతాయి.
వాటిని సేకరించి వాడుకోవచ్చు.
వ్యవసాయదారులు తన భూసారాన్ని పెంపొదించడానికి మాత్రమే కాకుండా
వెర్మి కంపోస్ట్ తయారు చేసి ఇతర రైతులకి అమ్మకం ద్వారా ఆదాయం పొందవచ్చు.
- కంపోస్ట్ తయారీ ఎలా చెయ్యాలి ?
- కంపోస్ట్
తయారు చెయ్యాలంటే ముందు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిని తోటలో,
పెరటిలో లేదా పొలంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. గుంతలా లేదా తొట్టిలా
కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సైజు మన అనుకూలతని బట్టి నిర్ణయించుకోవచ్చు.
గుంతలో వేసే వ్యర్ధాల మరియు బయొమస్ పరిమాణాన్ని బట్టి గుంత సైజ్
నిర్ణయయించుకోవాలి.వానపాములు చీమల వలన నశించకుండా నీటి కాలువలు ఏర్పాటు
చెయ్యాలి.
- దీని నిర్మాణం ఇటుక సున్నపుగచ్చులని ఉపయోగించాలి. నీళ్ళు పోవడానికి దారులు ఏర్పరచాలి.
2. వర్మి బెడ్ ఏర్పాటుకి నేల
సారవంతంగా ఉండాలి. విరిగిన ఇటుకముక్కలుబరకగా ఉండే మన్ను గల ఐదు సెం మీ
మందంగల నేలపై పదిహేబను నుంచి ఇరవై సెం.మీ మందం తో బంకమట్టి శుద్ధి చేసిన
చెత్తని ఉంచాలి.
3 . వానపాములు ఈ సారవంతమైన నేలపై ఉండేలా చూడాలి/ 2 మీ. x 1 మీ. x 0.75 మీ. కంపోస్టు
గుంతకు కనీసం 150 వానపాములను ఉండేలా చూడాలి.
4. తాజా ఆవు పేడ ని ఈ బెడ్ పై వెదజల్లాలి . దానిపై ఐదు సెం.మీ మందంగా ఎండుటాకులు/ ఎండుగడ్డి/ వ్యవసాయవ్యర్ధాలు ఉంచాలి.
5. ఆ తర్వాత 30 రోజులదాకా ఆ గోతిని
రోజూ అవసరమైన మేరకు నీటితో తడపాలి.
ఈ బెడ్ మరీ పొడిగా ఉండకూడదు మరీ తడిగా ఉండకూడదు. సమంగా ఉండాలి. గుంత ఎల్లప్పుడు చెమ్మగా ఉండేలా జాగ్రత్త పడాలి.
6 .
బెడ్ పక్షుల వలన పాడవకుండా జనపనార గోతాలు తో కప్పాలి. ప్లాస్టిక్ సంచులు
మాత్రం కప్పటానికి వినియోగించకూడదు. ఇవి మరీ ఎక్కువ వేడిని కలిగిస్తాయి.
7. ముప్ఫై రోజులు గడిచాక తడి గా ఉన్న జీవరసాయన వ్యర్ధాలుతో గానీ లేదా ఆకూ,
అలములతో గాని కప్పాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యాలి.
8. కత్తి / కొడవలి వంటివాటితో ఈ వ్యర్ధాలని కలియతిప్పుతో ఉండాలి.
ఎరువు ఎలా తయారవుతుంది ?
1 .
గుంత / తొట్టి పరిమాణాన్ని బట్టి అరవై నుంచి తొమ్భై రోజుల్లో ఎరువు
తయారవుతుంది. కంపోస్ట్ కై వేసిన వ్యర్ధాలన్నీ వదులై నల్లటి రంగులో ముక్క
ముక్కలుగా తేలిక గా ఉండి పచ్చి ఎరువులా తయారై ఉంటుంది. వానపాములు ఎక్కువగా
గుంతపై కనిపిస్తూ ఉంటే ఎరువు వాడటానికి సిద్ధంగా ఉన్నట్లు మనం భావించవచ్చు.
అయితే కంపోస్ట్ ఎరువుని వానపాములనించి వేరు చెయ్యాలి. వేరు చెయడానికి మూడు
రోజుల ముందుగా గుంతపై నీటిని జల్లటం మానివేయాలి. పైన తేమ లేకపోవడంతో
చాలావరకు వనపాములు అడుగుభాగానికి చేరుకుంటాయి. మిగిలిన వాటిని జల్లెడ లేదా
వల సహాయంతో వేరు చెయ్యవచ్చు. దీనివలన వానపాములు, మందమైన వ్యర్ధాలు కిందకి
దిగకుండ ఉంటాయి. వీటిని మళ్ళీ గుంతలొకి వ్యర్ధాలుగా వాడచ్చు.
కంపోస్ట్ ఎరువు నుంచి దుర్వాసన వచ్చినా లేదా బూజు వాసన వచ్చినా ఎరువు
సరిగా తయారవ్వలేదని అర్ధం. మట్టివాసన వస్తేనే ఎరువు సరిగా తయారైనట్లు
భావించవచ్చును. బూజు పట్టిన వాసన ఎరువులో నత్రజని లోపానికి గుర్తు.దీనికి
నివారణగా గుంతలొ ఉన్న వాటికి గాలి పారేలా చేసి పీచుతో కూడిన పదార్ధాలని
కలపాలి. అ తర్వాత మాత్రమే జల్లెడ పట్టాలి లేదా తయారైన వ్యర్ధాలన్నిటినీనీ ఎండ తగిలే చోట కుప్పల ఉంచాలి. దీని వలన వానపాములు అడుగుకి చేరతాయి.
గదుల
పద్దతిలో కంపోస్ట్ చేస్తున్నట్లైతే ముందుగా మొదటి గదికి నీటిని పట్టడం
ఆపివేయాలి. వానపాములు చెమ్మ ఉన్న మరోగదికి వెళ్ళిపోతాయి. గదులవారీగా ఎరువు
తయారుచెయ్యాలి.
2. ఎరువు అతితక్కువ ఖర్చులో వస్తుంది. పైగా హానికరం కాదు
3. వానపాములు భూమిని సారవంతం చేసి చెట్లు ఏపుగా పెరిగేందుకు సహాయపడతాయి.
4 . ఈ ఎరువు వలన ఖనిజాలు సరైన మోతాదులో లభ్యమవుతాయి.
5 . చెట్లకి అవసరమైన పోషక పధార్ధాలు అందుతాయి.
6 . వ్యాధులని కలగచేసే సూక్ష్మజీవులని ఎదగకుండా చేస్తుంది. ఆ ప్రక్రియ లో భూసారానికి హాని కలుగదు.
7 . చెత్తని వ్యర్ధంగా బయటపడేస్తే కాలుష్యమవుతుంది. ఇలా ఉపయోగిస్తే ఎరువు అయ్యి కాలుష్యాన్ని తగ్గిస్తోంది
8 .
ఆదాయాన్నిచ్చే పరిశ్రమగా యువత దీన్ని గుర్తించడంవలన కొద్ది పెట్టుబడి
శ్రమతో వారు ఆదాయాన్ని పొందవచ్చు సారవంతమైన ఎరువులని మెరుగైన ఆహారాన్ని
ప్రజలకి అందించవచ్చు.
మిగిలిన వివరాలు త్వరలో....
Sir,
ReplyDeleteThank you very much for the useful and informative posts.
We are eagerly waiting for the other parts and information on other sectors also
Once again thanks a lot.
Ravi Kumar
చక్కటి విషయాలను తెలియజేస్తున్నారు.
ReplyDeleteరవికుమార్ గారు, anrd gaaru
ReplyDeleteThanks.