పుట్టగొడుగుల
ఉత్పత్తి - 1
పుట్ట గొడుగులు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. దీని వలన పెంచినవారికి ఆదాయము, తిన్న వారికి పౌష్టికాహారము లభిస్తాయి. ఈ వ్యాపారము / వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగిన వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. దీని వాడకము ప్రస్తుతము పట్టణాలలో ఎక్కువగానే ఉంది. నెమ్మదిగా విస్తరిస్తోంది. దీనిని శాకాహారము గా భావించడం వలన కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.
పుట్ట గొడుగులు అంటే ఏమిటి?
పుట్ట గొడుగులు అంటే ఏమిటో మరియు దీని గురించి వ్యవహారిక భాష లో తెలుసుకుందాం.
పుట్ట గొడుగులు అంటే ఒక రకమైన ఫంగస్ మాత్రమే. అయితే కొన్ని రకములైన ఫంగస్ లు మాత్రమే తినదగ్గవి. ఇందులోని చాలా రకాలు విషపూరితాలు. ఈ తినదగ్గ పుట్ట గొడుగులలో రెండు రకాలు ఉన్నాయి. అవి:
1. అడవులలో (సహజంగా) పెరిగేవి.
2. కృత్రిమ వాతావరణంలో పెంచేవి.
1. అడవులలో (సహజంగా) పెరిగేవాటిలో తినదగ్గరకాలు చాలా తక్కువ వాటిలో Guchhi, Dhingri, Shittakke, Paddy Straw వంటివి ముఖ్యమైనవి.
2. కృత్రిమ వాతావరణంలో పెంచే వాటిలొ Button Mushroom, Oyster Mushroom వంటివి ముఖ్యమైనవి.
Button Mushroom:
Oyster Mushroom :
మన దేశం లో Oyster Mushroom యొక్క ఉత్పత్తి, Button Mushroom కంటే తక్కువ. ఈ Oyster Mushroom కి డిమాండ్ విదేశాలలో ఎక్కువ.
వీటి పెంపకము , మార్కెటింగ్ వంటి వివరములు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ
పుట్ట గొడుగుల కు ప్రత్యేకమైన సీజన్ అంటూ ఎమీ లేదు. ఇవి సంవత్సరం పొడవునా
వస్తాయి. పైగా వీటికి పెద్దగా infrastructure కూడా అవసరం లేదు. ఇవి పెద్దగా
స్థలంను కూడా అక్రమించవు.రవాణా ఖర్చు కూడా పెద్దగా ఉండదు.వీటికి జాతీయ,
అంతర్జాతీయ మార్కెట్ కూడా బాగా ఉంది. ( Non voluminous with high value
product).వీటికి ఇంత డిమాండ్ రావడానికి కారణాలు:
1. ఇందులో క్రొవ్వు బాగా తక్కువ
2. ఫొలిక్ ఆసిడ్, విటమిన్లు, మినరల్స్,అమినో ఆసిడ్లు ఎక్కువ.
3. తేలిక గా అరుగుతుంది.
4. డయాబిటిక్ పేషంట్ లు కూడా వీటిని తినవచ్చును. ఈ కారాణాల వలన దీనికి డిమాండ్ పెరుగుతోంది.
పుట్టగొడుగుల పెంపకం ఎలా ?
ప్రారంభంలో
ఒక 20-25 చదరపు అడుగుల షెడ్ అవసరం. వీటి పెంపకం ఎంత తేలికంటే వీటిని ఒక
పూరి పాక లో కూడా పెంచవచ్చు. ఇదే షెడ్ లేదా పాక ను రెండు గదులుగా విభజించుకొని ఒక దానిని విత్తుకోవడానికి మరొకదానిని పెంపకానికి
వాడుకోవచ్చు. ఈ విత్తుకొనే గదిలో 25 నుంచి 300 సె ఉష్ణొగ్రత ఉం
డాలి.పెంపకానికి వాడే గదిలో 23 నుంచి 250 సె
ఉష్ణోగ్రత ఉండేలా, చూసుకోవాలి. ఈ గదిలో మాత్రం గాలిలో తేమ 75 - 80% కన్నా
ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి. రెండు గదులకూ కూడా గాలి, వెలుతురూ ఉండేలాగా
చూసుకోవాలి.
వీటికి కావలసినవి :
1.జొన్న/ గోధుమ ధాన్యాలు / ముడిశనగలు/ సజ్జ మొదలైనవి.
2.శిలీంద్రము (దీనిని మంచి వ్యవసాయ పరిశొధనా శాల నుంచి తెచ్చుకోవాలి.ఇందులో రాజీ పడకూడదు.)
3.
పై పొట్టుతీసిన మొక్కజొన్న/ గడ్డి ( వరి గడ్డి / చెరకు పిప్పి)
4. పాలిథిన్ సంచులు
5. ఉష్ణోగ్రత,
తేమలను కొలిచే థర్మామీటర్, హ్యుమిడిటీ మీటర్.
1. గడ్డి ని 5-7 సె.మీ. ముక్కలు గా కత్తిరించుకుని వాటిని 5-7 గం.
నానబెట్టిన తర్వాత వేడి చెయాలి. ఈ నీటి ని పారబోసి 65-75 % తేమ ఉండేలా
ఆరబెట్టాలి.
2. ముందుగా ఈ ధాన్యాలను సగం ఉడకబెట్టి గాలికి ఎండ
బెట్టాలి. దీనికి కాషియం కార్బొనేట్ పొడి 2 % కలపాలి. ఈ ధాన్యాన్ని ఖాళీ
సీసాల లో నింపుకోవాలి.ఈ సీసాలను వేడి నీటిలో ఉడకబెట్టాలి. ఇప్పుడు
తెచ్చుకున్న శిలీంద్రాన్ని 12-15 రోజులు పొదిగిన తర్వాత ఇంతకు ముందు మనం
ఉడికించి పెట్టుకున్న సీసాలలోని దానితో కలిపి విత్తుకోవాలి.
ఇప్పుడు రెండువైపులా తెరిచి ఉండే పాలిధిన్ సంచులను తీసుకుని ఒక వైపు
మూతి కట్టి మధ్యలో 2-3 రంద్రాలు చెయ్యాలి. ఆ గడ్డిని 5 సెం.మీఎత్తు లో ఈ
సంచిలో వేసుకోవాలి. దాని పైన మనం పైన చెసుకున్న దానిని వేయాలి. ఇలా 4
పొరలు వెయాలి. ఇప్పుడు ఈ సంచి రెండొ మూతి ని కట్టివేసి వరసగా పెట్టాలి.
18-25 రోజుల తర్వాత ఈ సంచులను తీసివేసి పెంపకం కోసం కేటాయించుకున్న గదిలోకి
మార్చి, వరసగా పేర్చుకోవాలి. ఇప్పుడు వీటి పైన నీటిని తరచుగా జల్లుతూ ఉండాలి.
సాదారణంగా ఇవి 4-6 రోజులలొ కోతకొస్తాయి.ఇవి సాదారణంగా 2-3 పంటలను ఇస్తాయి. రోజూ కానీ, రోజు విడిచి రోజు కానీ కోత కొస్తాయి.
ఈ విధంగా కోసిన పంటను మార్కెట్ చేసుకోవచ్చు.
పైన వివరించిన విధానము సాధారణంగా ఉపయోగించే విధానము అయితే, ఈ
వ్యాపారం / వ్యవసాయం ప్రారంభించే ముందు ఆ ప్రదేశం లేదా చుట్టు పక్కల ఊళ్ళలో
ఉన్న మార్కెట్ ను అంచనా వేసుకొని ప్రారంభించుకోంటే మంచి లాభాలని
పొందవచ్చు. అలాగే ఈ పుట్టగొడుగు లకు విదేశీ ఎగుమతి అవకాశములు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఉపయోగించు కుంటే మంచి లాభాలను పొందవచ్చు.
ఈ వ్యాపారానికి సాధారణంగా అయ్యే పెట్టుబడి, దాని వలన వచ్చే లాభాలు వంటి వివరములు త్వరలో...
No comments:
Post a Comment