మన దేశ ప్రజలలో 70 % వ్యవసాయం మీద ఆధారపడ్డా, జిడిపి లో వ్యవసాయం రెండు శాతం మాత్రమే. మన నాయకుల పుణ్యామా అని నేడు వ్యవసాయం, పేదరికం రెండూ పర్యాయపదాలు అయిపోయాయి. ఈ
వ్యవసాయానికి విలువ ఆధారితాలని జోడించడం ద్వారా వ్యవసాయానికి
వివిధ పరిశ్రమలకి, రైతులకి మంచి ఆదాయం వస్తుంది.
ఈ విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా నిరుద్యోగం, పేదరికం కొంతవరకు తగ్గుతాయి. ఈ పరిశ్రమలని తమ తమ గ్రామాలలోనే తక్కువ పెట్టుబడితో స్థాపించవచ్చును. దీనివలన ఆయా గ్రామాలలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. Forward - backward linkage వలన ఆదాయాన్ని ఖచ్చితంగా పెంచుకోవచ్చు.
ఈ విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా నిరుద్యోగం, పేదరికం కొంతవరకు తగ్గుతాయి. ఈ పరిశ్రమలని తమ తమ గ్రామాలలోనే తక్కువ పెట్టుబడితో స్థాపించవచ్చును. దీనివలన ఆయా గ్రామాలలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. Forward - backward linkage వలన ఆదాయాన్ని ఖచ్చితంగా పెంచుకోవచ్చు.
మనదేశంలోని దాదాపు ఇరవై Agro Climatic Zones, రకరకాల మట్టి రకాలు, వాతావరణ పరిస్థితులు ఉండటం వలన దాదాపుగా ప్రపంచంలో పండే అన్ని రకాల పంటలని పండిచవచ్చును. వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్న మనదేశం నేడు దిగుమతి చేసుకుంటోందంటే దానికి కారణం ఎవరు ?
మనం ప్రపంచంలో పాలు, చెరకు, టీ ఉత్పత్తిలో అగ్రస్థానం లో ఉన్నాం. మన వ్యవసాయ ఉత్పత్తు లలో 10 % నుంచి 20 % వరకు ( వీటి విలువ సుమారుగా ఒక లక్షకోట్ల రూపాయిలు) నిల్వ చేసుకోగలిగే వసతులను ( post harvest facilities) కల్పించుకోలేక పోవడం వలన కోల్పోతున్నాము. పంట చేతికొచ్చినప్పుడు దానిని నిల్వ చెయ్యడానికి కావలసిన్నన్ని సాధారణ
గిడ్డంగులని కూడా మనం నిర్మించుకోలేకపోయాము.
Agro processing అంటే ఏమిటి ?
సాధారణ భాషలో చెప్పాలంటే వ్యవసాయ ఉత్పత్తులని నిలువ చేసి , వివిధ రకాలుగా వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమయ్యే వీలుగా చేసే ప్రొసెసింగ్ నే ఆగ్రో ప్రోసెసింగ్ అంటాము.
Agro processing అంటే ఏమిటి ?
సాధారణ భాషలో చెప్పాలంటే వ్యవసాయ ఉత్పత్తులని నిలువ చేసి , వివిధ రకాలుగా వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమయ్యే వీలుగా చేసే ప్రొసెసింగ్ నే ఆగ్రో ప్రోసెసింగ్ అంటాము.
ఈ ఆగ్రో ప్రోసెసింగ్ ను మూడు విధాలుగా విభజిస్తారు.
1. Primary Processing : Cleaning, grading, milling packing వంటి ప్రక్రియలను ఇందులో చేరుస్తారు.
2. Secondary Processing: ఆగ్రో ప్రొసెసింగ్ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకు గా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు.
3. అగ్రో ప్రొసెసింగ్ పరిశ్రమలు: వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి, వివిధ ఉత్పత్తు లను తయారు చేయడం.
మన దేశం లో సుమారుగా 10 లక్షల కోట్ల ఆహారపదార్ధల మార్కెట్ ఉంది. ఇందులో సుమారుగా 60 % ప్రైమరీ ప్రొసెసింగ్ లోనే ఉన్నయి. ఈ మార్కెట్ సంవత్సరానికి 20 % దాకా పెరుగుతోంది.
ఆగ్రొ ప్రొసెసింగ్ వలన లాభాలు:
- చిన్న రైతులకు అదాయం పెరుగుతుంది.
- గ్రామాలలో పరిశ్రమల స్థాపన పెరుగుతుంది. దీని వలన నగరాలకు వలసలు తగ్గుతాయి. దీని వలన నగరాలపైన వస్తున్న ఒత్తిడి అదుపులోకి వస్తుంది.
- గ్రామాల్లో ఆదాయం పెరగడం వలన, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. మన దేశ అర్ధిక పరిస్థితి మెరుగు పడడానికి ఇది తప్పనిసరి.
- అన్నింటి కన్నా ముఖ్యంగా దేశంలో పేదరికం తగ్గుతుంది.
ఆగ్రో ప్రోసెసింగ్ కు అనువైన పంటలు / పరిశ్రమలు:
- పళ్ళు, కూరగాయలు- జ్యూస్ లు, జామ్ లు, పచ్చళ్ళు వంటివి.
- పువ్వులు
- ఔషద మొక్కలు, వాటి ఉత్పత్తులు
- బియ్యం, గోధుమ, పప్పు దినుసులు
- సొయాబీన్ ఉత్పత్తులు
- చెరకు వాటి ఉత్పత్తులు
- ప్రత్తి వాటి ఉత్పత్తులు మొదలైనవి...
Post Harvest facilities లేక పోవడం వలన మనం కోల్పతున్న లక్ష కోట్ల వ్యవసాయ ఉత్పత్తులలో ప్రధానమైన ఉత్పత్తులు:
- Oils & Fats : 36 %
- Milk Products : 18 %
- Cold beverages : 15 %
- Bakery- 6 %
- Confectionery : 4 % etc...
సాదారణంగా ఈ పరిశ్రమలు లాభాల బాటలో పయనించాలంటే ఈ క్రింది విషయాలపైన దృష్టి పెట్టాలి:
- సరి అయిన సమయంలో బ్యాంక్ ఋణం పొందడం (అవసరమైతే)
- పటిష్టమైన Forward- Backwar Linkages ను తయారు చేసుకోవడం
- నాణ్యతా ప్రమాణాలను పాటించడం
- పటిష్టమైన సప్లయ్ చైన్ ను తయారు చేసుకోవడం
- మార్కెట్ లో చక్కటి పేరు ( ఇమేజ్) ను పొందడం.
ఈ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఇంకా మంచి ఆదాయమును కూడా పొందవచ్చు. ఈ రంగం లో ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రొత్సాహకాలు ఉన్నయు. వాటి గురించి, ఈ పరిశ్రమల గురించిన మరిన్ని వివరాలను తర్వాత టపాలలో తెలుసుకుందాం...
thank you for good information.
ReplyDeleteis there any thing we can do from turmaric ? since our area ( tenali ) largest producer of turmaric, if so please suggest a good self employement idea within 10 laks.
thank you once again
srinivas rao
9848193081
suryasystems1@gmail.com
Srinivasrao garu,
ReplyDeleteYes, for Turmeric processing there are good prospects. I presume that your capital can be Rs. 10 lacs (max) rest can be Bank loan.
I will post / tell u about this shortly.