అంకుర సంస్థల స్థాపన – 1
(start-up enterprises
– 1)
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. పారిశ్రామికంగా మన దేశం అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కొన్ని
సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి, వ్యాపారం చేయాలని అనుకుంటున్నవారు,
ఆర్ధిక భద్రత ఉండదని భావించటం, గతంలో వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళని చూసి
భయపడటం,
వ్యాపారం ప్రారంభించడానికి, అది లాభాల బాట పట్టేదాక
నిలదొక్కుకోవడానికి తగినంత ఆర్ధిక స్తోమత లేకపోవడం, ఉద్యోగంలో
బధ్రత అంటే, నెలవారీ జీతం, పెన్షన్ స్థిరంగా ఉండవనే అభిప్రాయం, జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, వ్యాపారాలలో వచ్చే ఒడిదుకులని
అధిగమించలేరనే భయంతో పెద్దవాళ్ళు వారించటం వంటివి. కారణాలు ఏవైనా, మన దేశంలో చాలా మంది జాబ్ సెక్యూరిటీకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. చదువుకి,
ఉద్యోగానికి ప్రోత్సాహమిచ్చే తల్లితండ్రులతో పోలిస్తే వ్యాపారానికి
ఎంకరేజ్ చేసే పేరంట్స్ చాలా తక్కువ. మన విద్యా విధానం కూడా అందుకు అనువుగా లేదు. ఒక ఎంట్రప్రినియర్ గా స్థిరపడాలంటే మిగిలిన సవాళ్ళతో
పాటు వీరిని ఒప్పించడం కూడా ఒక సవాలే నేటి తరానికి.
ఈ సామాజిక సమస్యలకి కారణాలు ఏమిటి ???
కేవలం అవగాహనా లోపం, మార్పుని ఒప్పుకోలేకపోవడం, మార్పుని ఒప్పుకుంటూ, నైపుణ్యాలు పెంచుకుంటూ పోతే ఏ
రంగంలో అయినా విజయం సాధించవచ్చు. కానీ ఎలా… ??? ఒక ఉద్యోగానికి అప్ప్లై చెయ్యాలంటే ఇన్ని ప్రశ్నలు
ఉండవు. ఎందుకంటే ఆ రంగం ఒకరు నడిచిన దారి. ఒక వ్యాపారానికి మాత్రం ఈ ప్రశ్నలు
ఉంటాయి. ఎందుకంటే అది మీరు వేసే దారి. మీతో పాటు పదిమందిని నడిపించే దారి. చాలా
మందికి అనిపించవచ్చు, ఎందుకు ఇంత రిస్క్ చేసి ఈ రంగమే ఎంచుకోవాలి ? అని... అసలు వ్యాపార రంగం చుట్టూ ఎందుకింత భయాలు, అపోహలు
ఉన్నాయి. వీటికి సంబందించి సాంకేతిక కారణాలు ఇప్పుడు
పరిశీలిద్దాం.
ఒక దేశం ఆర్ధికంగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల స్థాపన , వ్యాపారాల స్థాపన అత్యవసరం. వీటి
వలన ఉపాధి అవకాశాలు, ప్రజల ఆర్ధిక ప్రమాణాలు పెరుగుతాయి.
తద్వారా ప్రజలకి క్వాలిటీ లైఫ్ అందుబాటులోకి వస్తుంది. అయితే అన్ని దేశాలలో వీటికి
పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నయా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా అభివృధ్హి చెందుతున్న
దేశాల సరసన ఉన్న భారతదేశంలో పరిశ్రమల స్థాపనకి, వ్యాపారాల
స్థాపనకి ఉన్న అవకాశాలేమిటి ? అడ్డంకులు ఏమిటి ? వీటికి గల సామాజిక మరియు ఆర్ధిక కారణాలు ఇప్పుడు
పరిశీలిద్దాం. మెరుగైన అవకాశాలు, దానికి ప్రభుత్వం అందిస్తున్న
సహాయ సహకారాలు తెలుసుకుందాం. సంప్రదాయ ఉద్యోగాల మీద ఆసక్తి లేని యువతకి ఏ ఏ
మార్గాలున్నాయన్న విషయాలు చర్చిద్దాం. విజయవంతమైన వ్యవస్థాపకులుగా మన కొత్త
తరాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఏం చెయాలన్నది పరిశీలిద్దాం….
...ఇంకా ఉంది
No comments:
Post a Comment