వచ్చిన వారు

Tuesday, August 23, 2011

IBPS CWE( PO పరీక్ష ) వ్రాయడం లో మెళకువలు

 I B P S   C W E  వివిధ బ్యాంక్ లలో PO, Clerical పోస్ట్ ల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. 

PO టెస్ట్ వచ్చే నెలలోనే ఉంది. క్లరికల్ టెస్ట్ కి ఇంకా దాదాపు 2 నెలల వ్యవధి ఉన్నది.  బ్యాంక్ లు అభ్యర్ధులని నియమించుకునేటప్పుడు I B P S CWE లో అభ్యర్ధికి కేటాయించిన స్కొర్ కార్డ్ కి చాలా ప్రాధాన్యతని ఇస్తాయి. ఈ ఉమ్మడి వ్రాత పరీక్ష వలన 19 ప్రభుత్వ రంగ  బ్యాంక్ లకు విడి విడి గా ప్రిపేర్ అయ్యి పరీక్ష వ్రాసే ఇబ్బంది అభ్యర్ధులకి తప్పింది. పరీక్ష బాగా వ్రాసి మంచి స్కోర్ సాధించిన అభ్యర్ధులకి ఈ విధానం వలన చాలా ఉపయోగం ఉంటుంది.     కానీ , సరి అయిన స్కోర్ సాధించలేని అభ్యర్ధి  19 బ్యాంక్ ల నియామకంలోనూ వెనుకపడతారు. అలాంటి వారు మరల I B P S   CWE నోటిఫికేషన్ కొరకు వేచి చూడాల్సి వస్తుంది. ఇదివరకు పద్ధతి లో అయితే ఒక బ్యాంక్ నిర్వహించిన టెస్ట్ లో విఫలం అయితే మరొక బ్యాంక్ టెస్ట్ లో బాగా ప్రయత్నం చేసే అవకాశము ఉండేది. ఇప్పుడు       I B P S ఉమ్మడి వ్రాతపరీక్ష ద్వారా అలాంటి అవకాశము అభ్యర్ధులకి లేదు.  కాబట్టి ఉన్న సమయం సద్వినియోగం చేసుకోండి. ప్రిపరేషన్ మొదలు పెట్టండి.

1.  IBPS  వారు ఇచ్చిన సిలబస్ ప్రకారం చూస్తే 
             రీజనింగ్ 50 
             ఆప్టిట్యుడ్ 50
             బ్యాంకింగ్ నాలెడ్జ్ తో కూడిన జనరల్ అవరెనెస్ 50 
            కంప్యుటెర్ 50  
            ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 మార్కులు
            ఇంగ్లీష్ డిస్క్రిప్ట్ వ్ 25 మార్కులు కేటాయించారు.
కాగా ఒకొక్క విభాగం నుంచి 50 ప్రశ్నలు కేటాయించారు.
మొత్తం రెండున్నర గంటల వ్యవధిలో ఇంగ్లీష్ డిస్క్రిప్ట్ వ్ విభాగానికి విభాగానికి 60  నిమిషాలు పోగా మిగిలిన పేపర్ కి 150 నిమిషాలు సమయం.


2 . అభ్యర్ధి తన సామర్ధ్యాన్ని కచ్చితంగా అంచనా వేసుకోగలగాలి. ప్రతీ సబ్జెక్ట్ లో తన బలాబలాలు తెలిసి ఉండాలి.


3. తప్పు సమాధానికి పెనాల్టీ ఉంటుంది కాబట్టి ఎన్ని సమాధానాలు వ్రాసాము అన్నది కాకుండా ఎన్ని సరైన సమాధానాలు వ్రాసామన్నదాని మీద విజయావకాశం ఆధారపడి ఉంటుంది .


4. అభ్యర్ధి తనకు పట్టుఉన్న విభాగాన్ని ముందుగా పూర్తి చెయ్యడము వలన సమయం ఆదా అవుతుంది నమ్మకం పెరుగుతుంది.


5.  జనరల్ అవేర్ నేస్ ముందుగా ప్రారంభిస్తే మంచిది. ప్రశ్నని సాల్వ్ చెయ్యడానికి ఎక్కువ సమయం పట్టదు.


6. కచ్చితంగా సమాధానం తెలుసు  అన్నవి ముందుగా  పూరించండి..రాని ప్రశ్నలని ఊహించేటప్పుడు కటాఫ్ మార్క్స్ ని కూడా దృష్టి లో ఉంచుకోండి.


7. జనరల్ అవేర్ నేస్ తరువాత ఆంగ్ల విభాగానికి వస్తే మంచిది. వొకాబ్లరీ, గ్రామర్ మీద పట్టు ఉండాలి. 


8 . వ్యాసరచనకై న్యూస్ ఎడిటొరియల్స్ చదవండి. కొత్తపదాలని సంధర్భానుసారంగా వాడండి. అనవసరమైన హంగులకి పోవద్దు. వ్రాసేది సూటిగా సరళంగా చదివేవారికి సులభంగా అర్ధం అయ్యేలా వ్ర్రాయండి. చక్కని చేతివ్రాతతో సంధర్భానుసారంగా కరంట్ఎఫైర్స్ తో వ్యాసాన్ని అనుసంధానించండి.


9. విభాగాల వారీగా చదివినప్పటికీ పాత పేపర్లు పూరించండి. దొరకని వారు మోడెల్ పేపర్లు పూరించండి . ఈ అలవాటు పరీక్ష హాలులో తడబాటు నుంచి మిమ్మలని కాపాడుతుంది. ఎంత ఎక్కువగా అబ్యాసం చేస్తే పరీక్షలో అంత ఎక్కువ సమయం కలసివస్తుంది.మోడెల్ పేపర్లు పూర్తి చేసే ముందు టైమ్ సెట్ చేసుకోవడం మరువకండి. ఎక్కువ సమయం పడుతోంటే మరింత ప్రాక్టీస్ అవసరం అని గుర్తించండి.


10. మీరు ఇంతకు ముందు ప్రిపేర్ అయి వున్నాఇప్పుడు వెంటనే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. 


11. మోడెల్ పేపర్ పూర్తి చేసే ముందు పైన చెప్పిన సూచనలు దృష్టిలో ఉంచుకోండి. 


12. C W E  గురించిన మరిన్ని వివరములకు, కొన్ని మోడల్ పేపర్ల కు ఇక్కడ   చూడండి. 


గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
    
     
            

IBPS CWE -- క్లరికల్ పోస్ట్ కై ఉమ్మడి వ్రాత పరీక్ష

IBPS  CWE గురించి తెలుసుకుందుకు   ఇక్కడ   చూడండి.
ఇప్పుడు క్లరికల్ గ్రేడ్ లో అభ్యర్ధుల నియామకం కోసం ఉమ్మడి వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. కేవలము ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చెయ్యాలి.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 25/08/2011

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ : 24/09/2011

పరీక్ష తేదీ : 27/11/2011 

విద్యార్హతలు, వయసు మొదలైన వివరాలకై  IBPS WebSite  చూడండి.




గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.