వచ్చిన వారు

Friday, April 29, 2011

కరూర్ వైశ్య బ్యాంక్ లొ ఉద్యొగ అవకాశములు.


కరూర్ వైశ్య బ్యాంక్  వారు వివిద పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://careers.kvb.co.in/scripts/careerlogin.aspx  దర్శించండి

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
 
           

Tuesday, April 26, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 3 ( వచ్చే లాభమెంత ..? )

ఈ టపా ముందు భాగాలు స్వయంఉపాధి / వ్యవసాయం లేబుల్స్ లో చూడవచ్చు.


వచ్చే లాభమెంత ..?

ఉదాహరణకి ఒక 500 లీటర్ల పాల ప్రొసెస్సింగ్ ప్లాంట్ కి ఏఏ వసతులు కావాలి, ఎంత పెట్టుబడి కావాలి ఎంత లాభం వచ్చే అవకాశం ఉందో ఈ టపాలో చర్చిద్దాం.

ప్లాంట్, మౌలికవసతులు గల( రోడ్.నీరు మొదలైన సదుపాయాలు) గల ఒక మేజర్ పంచాయితీలో పెట్టగలిగితే మంచిది. పాల యొక్క ధర నిర్ణయం FAT / SNF  పరీక్ష ద్వారా నిర్ణయించాలి. ఈ  షరతులు పాటించి వ్యయ నిర్ణయం లాభనిర్ణయం జరిగిందని గమనించండి.  

ప్లాంట్ కి కావలసిన యంత్రసామాగ్రి వీటినే స్థిర ఆస్థులు గా చెప్పవచ్చు  ఉదాహరణకి బరువు తూచే యంత్రం , Bulk Cooler, Refrigeration unit, Cream Separator, Fat testing machine... మొదలైనవి  వీటికి సుమారుగా 2,50,000 రూపాయలు  అవుతుంది.( ఇందులో భవనం అద్దె కలుపలేదు).

పాల కొనుగోలు, సిబ్బంది జీతాలు మొదలైన చర ఖర్చులకి  రోజుకి సుమారుగా 13,200   రూపాయలు అవుతుంది. దీనికి బ్యాంక్ వడ్డీ, తరుగుదల వంటివి కలిపితే 13,500  రూపాయలు అవుతుంది.

పాలు, వెన్న అమ్మకము ద్వారా రొజుకు   15,000 రూపాయలు దాకా ఆదాయము వస్తుంది. అంటే రొజుకు  1500 రూపాయలు లాభం.

ఇవి కాక నిలువ ఉండే పనీర్,  నెయ్యి మొదలైన అదనపు ఉత్పత్తులు చెయ్యగలిగితే  మరింత వ్యాపారం విస్తరిస్తుంది.

పాలు సంపూర్ణపోషకాహారం అంటారు. పసిపిల్లలు , రోగులు, గర్భిణీలు, ఎక్కువగా ఆధారపడే పాలు అమ్మకంలో నాణ్యత పాటించండి.శుభ్రత ని పాటించండి.  ఆరోగ్యాలకి హాని చేసే రసాయనాలు కలపకండి. మీరు పాటించే విలువలు మీ వ్యాపారానికి ప్రధమ పెట్టుబడి. వినియోగదారుని విశ్వాసం చూరకొనటమే అసలైన లాభార్జన.

బ్యాంక్ ఋణము కావలసిన వారు ఇంతకు ముందు వ్రాసిన PMEGP 1 , PMEGP- 2 టపాలు చూడండి.

మరిన్ని ఋణ పథకాలు తరవాత టపా లలో తెలియచేస్తాను. మిల్క్ ప్రొసెస్సింగ్ లో మరిన్ని ఉపాధి అవకాశాలని కూడా తరువాత టపా లలో తెలుసుకుందాము.
               
               


        

Sunday, April 24, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 2

       సంస్థ లాభాలలో పయనించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటిలో ముఖ్యమైనది ప్లాంట్ స్థాపించే స్థల నిర్ణయం . ప్లాంట్ పాలు సేకరించుకోడానికి మరియు వాటిని మార్కెట్ చెయ్యడానికి అనువుగా ఉండాలి . అంటే ఎంచుకునే స్థలం అటు పాల అమ్మకందారులకి ఇటు మన వినియోగదారులకి దగ్గరగా ఉండేలా ఎంచుకోవడము గనుక సాధ్యపడితే రవాణా ఖర్చులు కలసి వస్తాయి. రోజుకి 500 లీటర్ల  పాలు ప్రోసెస్ చెయ్యడానికి సుమారుగా 300 నుండి 500 చదరపు అడుగులు వైశాల్యం ఉన్న  భవనం ( ఇల్లు/దుకాణం )  సరిపోతుంది. గాలి, వెలుతురు , నీటివసతి,  శుభ్రపరచడానికి అనువైన ఫ్లోరింగ్ అవసరం.
 

        ప్లాంట్ పెట్టాలనుకున్న ప్రదేశానికి చుట్టుపక్కల గల పాడి పశువులు శాతం ఎంతవరకు ఉన్నది, వాటి వయస్సు, జాతి, అంటే  పాల లభ్యత ఏవిధంగా ఉందో తెలుసుకోవాలి. 
        పాల వ్యాపారులు/రైతులు పాలని ఏవిధంగా విక్రయిస్తున్నారు ఏ రేటుకి విక్రయిస్తున్నారో తెలుసుకోవాలి . పాల యొక్క నాణ్యత పరిక్షించుకోవాలి.
ప్లాంట్ పెట్టాలనుకునే ఔత్సాహికులకి ఎవరికైనా ఈ విషయం గా మరింత సమాచారం కావాలంటే కామెంట్ ద్వారా సంప్రదించవచ్చు.


వచ్చే టపాలో లాభం,  బ్యాంక్ ఋణం గురించి తెలియచేస్తాను. 

           
            
         

Saturday, April 23, 2011

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ 1

     యువతరంకి ఎదిగే అవకాశం  ఉన్న రంగాలలో పాల ప్రాసెస్సింగ్  ఒకటి.   ఈ రంగంలో స్వయంఉపాధి అవకాశాలు వినియోగించుకుని స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలని అర్జించవచచ్చును నలుగురికి ఉపాధి కల్పించవచ్చు.
         
     పాల ఉత్పత్తిలో భారతదేశము మిగిలిన దేశాలన్నిటి కన్నా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఒక సర్వే ప్రకారం దేశ జనాభా లో 25% మంది ప్రత్యక్షంగా  20%   పరోక్షంగా పాల మీద,  పాల ఉత్పతుల మీద వచ్చే ఆదాయం మీద   ఆధారపడి జీవిస్తున్నారు. ఇదివరకులా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు  పాకేజ్డ్ పాల కి ప్రాధాన్యత ఇస్తున్నారు.  పాల ఉత్పత్తుల వాడకం కూడా ఇదివరకు మీద ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చిన్న వ్యాపారస్థులు పాలని నిలువ ఉంఛే సామర్ధ్యం లేకపోవడం వలన పాలు పాడై పోయి నష్టపోతున్నారు. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటొంది. ఈ కాలంలో కాలరీత్యా  వచ్చే కొరతకి ఈ నష్టం తోడవ్వడం వలన అటు వాడుకదారులు ఇబ్బంది పడుతున్నారు ఇటు  పాల వ్యాపారులు నష్టపోతున్నారు. 

             మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్  ద్వారా పాలు నిలువ ఉండే సామర్ధ్యం పెరుగుతుంది. తద్వారా పాలు పాడవడం వలన వచ్చే నష్టాన్ని నివారించవచ్చు మిగిలిన పాలతో పచ్చికోవా , పన్నీరు, పెరుగు , సుగంధి  పాలు మొదలైన వాటి తయారీ ద్వారా అదనపు ఆదాయం  పొందవచ్చు. అయితే ఈ పాల ఉత్పత్తిల కి ఎంత  మేరకు ఆదరణ ఉందన్న సందేహం రావచ్చు. ప్రజల పాలు, పాల ఉత్పత్తుల  వినియోగం ఇలా ఉంది. 
             పెరుగు -
7%
             కోవా - 7%
             వెన్న - 6.5%
             నెయ్యి - 27.5%
             పనీర్ - 7%
             పాలు - 45 %.

       ఈ రంగంలో  ఔత్సాహిక వ్యాపారవేత్తలకి స్వయంఉపాధి  అవకాశాలు మిక్కుటం గా ఉన్నాయి. ప్రకృతి, సర్కారు దెబ్బలతో అల్లాడుతున్న  వ్యవసాయదారులు కూడా కొద్ది పెట్టుబడి తో 
మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్  స్థాపించుకోగలితే స్థిరమైన ఆదాయం పొందవచ్చును.  ఈ వ్యాపారంలో  కనీసం Rs. 2.50 లక్షల పెట్టుబడి పెడితే నెలకి Rs.45,000 వరకు  ఆదాయం పొందే అవకాశం ఉంది.
  

    ఈ  వ్యాపారం లో వచ్చే లాభాల వివరాలు, స్థాపనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిశీలించవలసిన / దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు, బ్యాంక్ ఋణం ఎంతమేరకు ఏవిధంగా లభిస్తుందో వచ్చే టపాలలో తెలియచేస్తాను.
             

           

   

Friday, April 22, 2011

నవోదయ విద్యాలయ సమితి లొ ఉద్యొగ అవకాశములు (non teaching)

 
నవోదయ విద్యాలయ సమితి వారు Assistant, Audit Assistant, Hindi Transalator, Computer Operator, Stenographer and LDC పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.


మొత్తం ఖాళీలు : 16
       
వయస్సు :    18 నుంచి 27 / 30 ( depends on the post)

దరఖాస్తులు ప్రకటిత తేది నుంచి ౩౦ రోజులలోపు ఢిల్లీ కార్యాలయానికి సాధారణ టపా లో అందేలా పంపించాలి.



గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.


2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
             
                   
         
           

Thursday, April 7, 2011

కార్పొరేషన్ బ్యాంక్ లో 1000 ఉద్యొగ అవకాశములు

కార్పొరేషన్ బ్యాంక్ లో ఉద్యొగ అవకాశములు  .


కార్పొరేషన్ బ్యాంక్ వారు Single Window Operator  (Clerk)  పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.


మొత్తం ఖాళీలు :
       Single Window Operator (Clerk)  --  1000
       
  వయస్సు :  As on 31/03/2011 :  18 నుంచి 28
ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 04/04/ 2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  : 25/04/ 2011
వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 12/06/ 2011


విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://www.corpbank.com/asp/0100text.asp?presentID=1998&headID=805  దర్శించండి


గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.


2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.