వచ్చిన వారు

Sunday, September 29, 2013

C F L బల్బుల తయారీ - లాభాలు....

స్వయం ఉపాధి పధకాలలో C F L బల్బుల తయారీ ఒక లాభదాయకమైన రంగము. ఈ బల్బులకి మార్కెట్ డిమాండ్ కూడా బాగా ఉంది. వీటి గురించి మరియు ఈ బల్బుల తయారీలో వచ్చే లాభాలను గురించి క్లుప్తంగా చూద్దాం.

Sunday, August 25, 2013

బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులు....

వివిధ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులకై  IBPS  నిర్వహించు ఉమ్మడి వ్రాత పరీక్షకై
( CWE Clerks - III)  నోటిఫికేషన్ వెలువడింది.

వయోపరిమితి :  1/08/2013 నాటికి 20 నుంచి  28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.


ఎంపిక విధానం :  వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
 

ధరఖాస్తు చేసే విధానం : ఆన్ లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయాలి

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 19.08.2013 నుండి 07.09.2013  వరకు (సుమారుగా).

పరీక్ష తేదీలు:  30.11.2013, / 01.12.2013, / 07.12.2013, /  08.12.2013 / 14.12.2013 / 15.12.2013(సుమారుగా).


పరీక్ష ఫలితాలు ప్రకటించే తేదీలు : జనవరి 2014 రెండవ వారంలో..


ఇంటర్వూలు నిర్వహించే తేదీలు: ఫిబ్రవరి 2014 రెండవ వారంలో


ఎంపిక అయిన వారికి బ్యాంక్ లకు ఎలాట్మెంట్  తేదీలు: ఏప్రిల్ 2014 లో

అర్హతలు మరియు ఇతర వివరముల కొరకు దర్శించవలసిన  లంకె ....
              
                        
                     

Friday, July 12, 2013

బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్ల నియామకాలు...

వివిధ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్లు, మేనేజ్ మెంట్ ట్రేయినీ లకై  IBPS  నిర్వహించు ఉమ్మడి వ్రాత పరీక్షకై
( CWE - PO/ MT ) - III నోటిఫికేషన్ వెలువడింది.

వయోపరిమితి :  1/07/2013 నాటికి 20 నుంచి  28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం :  వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
దరఖాస్తు చేసే విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయాలి
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 22.07.2013 నుండి 12.08.2013  వరకు (సుమారుగా).
పరీక్ష తేదీలు:  19.10.2013, / 20.10.2013, / 26.10.2013, /  27.10.2013 (సుమారుగా).

అర్హతలు మరియు ఇతర వివరముల కొరకు దర్శించవలసిన  లంకె
 
పరిక్ష సిలబస్ మరియు పరిక్షకి సిద్ధమయ్యె ప్రణాళిక ఇతర వివరములు తర్వాతి పోస్ట్ లో.....


Sunday, July 7, 2013

బ్యాంకింగ్ రంగంలో, నిరుద్యోగులకు సువర్ణావకాశం....

నిరుద్యోగులకు,  రాబొయే 2-3 సంవత్సరాలలొ బ్యాంకింగ్ రంగంలో సువర్ణావకాశం లభించబోతోంది. 
గత సంవత్సరంలో దేశంలోని అన్ని బ్యాంక్ లలో మొత్తం మీద 80000 దాకా ఉద్యొగాలు ఖాళీలు ఉన్నాయి అన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం.   ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ సంవత్సరం అదనంగా 10000 శాఖలు తెరవబోతున్నయి. అంటే, కనీసం 50000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి అని ఒక అంచనా. దీనితో పాటుగా రాబొయే 2 - 3 సంవత్సరాలలో సుమారుగా మూడవ వంతు ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. దీనిని బట్టి ఉద్యొగావకాశాలు ఇంకా పెరుగుతాయి అని అర్ధం చేసుకోవచ్చు.ఇందుకు అనుగుణంగానే వివిధ బ్యాంకులు భారీగా నియామకాలు ప్రారంభించాయి / కొనసాగిస్తున్నాయి ( గత సంవత్సరం సుమారుగా 50000 నియామకాలు జరిగాయి) . 

అయితే బ్యాంకులలొ ఈ పరిస్థితి ఒక్కసారిగా వచ్చినది కాదు. ప్రత్యేకించి 1990 దశకంలో పెద్దగా విస్తరణ లేక పోవడం, తర్వాత బ్యాంకుల యాంత్రీకరణ (కంప్యూటరీకరణ) జరగడం వలన బ్యాంకులలో పెద్దగా నియామకాలు జరగలేదు. గత 5 -6 సంవత్సరాలుగా శాఖల విస్తరణ బాగా జరగడం, పదవీ విరమణలు జరగడం వలన ఇన్ని ఉద్యొగాలు సృష్టించబడ్డాయి. దీనికి ఫైనాన్షియల్ ఇన్క్లూషన్  కూడా దోహద పడింది.

అయితే ఇన్ని ఉద్యోగావకాశాలు ఉన్నా, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం జరిగిన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ 1500 ఉద్యోగాలకు 10 లక్షల కన్నా ఎక్కువ అభ్యర్ధులు పోటీ పడ్దారు. ముందు ముందు  మిగిలిన బ్యాంకులకు కూడా అంటే IBPS ద్వారా జరిగే నియామకాలకు  కూడా ఇంచుమించుగా పోటీ ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది.  తీవ్రమైన పొటీ ఉంటుంది అని అభ్యర్ధులు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ప్రణాళికాబద్దంగా తయారు అయితే విజయం తప్పక సిద్ధిస్తుంది. ఇంకా పరిక్షలకు నొటిఫికేషన్ వెలువడలేదు కనుక ఇప్పటి నుంచి తయారీ ప్రారంభిస్తే తప్పకుండా వారికి విజయం లభిస్తుంది.

చిరుదీపం అన్న గూగుల్ గ్రూప్ లో ఆసక్తి గల అభ్యర్ధులకి శిక్షణ ఇవ్వటం జరుగుతోంది. ఆసక్తి గల అభర్ధులు గ్రూప్ లోకి ప్రవేశం కొరకు  chirudeepamu@gamil.com మెయిల్ పంపండి.
             
                           

 

Sunday, May 5, 2013

గ్రూప్ కి ఆహ్వానం


చిరుదీపం కొత్త గూగుల్ గ్రూప్ కి ఆహ్వానం. 

బ్యాంక్ పరిక్షల కోచింగ్, స్టడీ మెటీరియల్, సందేహ నివృత్తి, వివిధ స్వయం ఉపాధి పథకాల గురించి సమాచారం మరింత వివరంగా ఇవ్వడానికి ఆస్కారం వుంటుందనే ఆలోచనతో అభ్యర్ధుల సౌకర్యార్ధం కొత్త గ్రూప్ ప్రారంభించాం. 

ఆసక్తి వున్నవారు chirudeepamu@gmail.com కి మెయిల్ పంపితే గ్రూప్ కి  ఇన్విటేషన్ పంపుతాము.
    
   

Wednesday, December 26, 2012

హామీ / తనఖా లేని ఋణాలు...

      
         సాధారణంగా ఏదైనా పరిశ్రమ / సేవల రంగంలో వ్యాపారం ప్రారంభించాలి అంటే  బ్యాంక్ లోన్ చాలా సంధర్భాలలో అవసరమవుతుంది. బ్యాంక్ లోన్ లేకుండా పూర్తిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన సొంత పెట్టుబడి తోనే ప్రారంభించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ లు  సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ లోన్  తప్పనిసరి అవుతుంది.

Friday, December 14, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 3


పసుపుకొమ్ములు సేకరించాక వాటిని ఆరబెట్టి , తుడిచి శుభ్రం చేస్తారు. 
తర్వాత వాటిని ఒక డ్రమ్ లో వేసి యంత్ర సహాయంతో తిప్పుతారు. దీని
వలన పైన ధూళి అంతా పోయి శుభ్రమవుతుంది. తర్వాత వాటిని గ్రేడింగ్

Thursday, December 13, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 2

ఇంతకు ముందు టపాలో  చెప్పిన్నట్లు గా ఈ రంగంలోని పరిశ్రమల గురించి  ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా చుద్దాం. 


Tuesday, November 6, 2012

కెరీర్- బయో మెడికల్ ఇంజనీరింగ్


మనకు ఉన్న కెరీర్ అవకాశములలో బయో మెడికల్ ఇంజనీరింగ్ గురించి క్లుప్తంగా చూద్దాం...

Sunday, October 28, 2012

స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 7


మిల్క్ ప్రొసెసింగ్ గురించి నాకు వచ్చిన ఈ మెయిల్స్ ను చూసాక ఈ రంగం గురించి మరి కొచెం విగా
...


Friday, October 26, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 1

        మన దేశ  ప్రజలలో 70 % వ్యవసాయం మీద ఆధారపడ్డా, జిడిపి లో వ్యవసాయం రెండు శాతం మాత్రమే. మన నాయకుల పుణ్యామా అని నేడు వ్యవసాయం, పేదరికం రెండూ పర్యాయపదాలు అయిపోయాయి. ఈ వ్యవసాయానికి విలువ ఆధారితాలని జోడించడం ద్వారా వ్యవసాయానికి  వివిధ పరిశ్రమలకి, రైతులకి మంచి ఆదాయం వస్తుంది. 

Wednesday, October 17, 2012

కెరీర్ ప్లానర్ - 1


ఇందులో మనకి అందుబాటులో ఉన్న వివిధ చదువు / ఉద్యోగ / వ్యాపార అవకాశముల ( Career planning ) గురించి క్లుప్తం గా చూద్దాం.


                                          
  
        

Friday, September 14, 2012

సేంద్రియ వ్యవసాయము - భారత ప్రభుత్వ సబ్సిడీ పధకములు...


సేంద్రియ వ్యవసాయము ను ప్రొత్సాహించడానికి భారత ప్రభుత్వము Capital Investment subsidy scheme for  commercial production units of organic inputs అనే పధకము ద్వారా  సబ్సిడీ ని అందిస్తుంది. దాని గురించి వివరాలు

Wednesday, August 8, 2012

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 2

సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 2

వెర్మి కల్చర్ యూనిట్ స్థాపనకు, అయ్యే వ్యయం మరియు వచ్చే లాభం గురించిన వివరాలు ఇప్పుడు