వచ్చిన వారు

Showing posts with label ఉద్యొగము. Show all posts
Showing posts with label ఉద్యొగము. Show all posts

Thursday, January 23, 2020

Sunday, August 25, 2013

బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులు....

వివిధ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులకై  IBPS  నిర్వహించు ఉమ్మడి వ్రాత పరీక్షకై
( CWE Clerks - III)  నోటిఫికేషన్ వెలువడింది.

వయోపరిమితి :  1/08/2013 నాటికి 20 నుంచి  28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ఎంపిక విధానం :  వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
 
ధరఖాస్తు చేసే విధానం : ఆన్ లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయాలి

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 19.08.2013 నుండి 07.09.2013  వరకు (సుమారుగా).

పరీక్ష తేదీలు:  30.11.2013, / 01.12.2013, / 07.12.2013, /  08.12.2013 / 14.12.2013 / 15.12.2013(సుమారుగా).

పరీక్ష ఫలితాలు ప్రకటించే తేదీలు : జనవరి 2014 రెండవ వారంలో..

ఇంటర్వూలు నిర్వహించే తేదీలు: ఫిబ్రవరి 2014 రెండవ వారంలో

ఎంపిక అయిన వారికి బ్యాంక్ లకు ఎలాట్మెంట్  తేదీలు: ఏప్రిల్ 2014 లో

అర్హతలు మరియు ఇతర వివరముల కొరకు దర్శించవలసిన  లంకె ....
              
Friday, July 12, 2013

బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్ల నియామకాలు...

వివిధ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్లు, మేనేజ్ మెంట్ ట్రేయినీ లకై  IBPS  నిర్వహించు ఉమ్మడి వ్రాత పరీక్షకై
( CWE - PO/ MT ) - III నోటిఫికేషన్ వెలువడింది.

వయోపరిమితి :  1/07/2013 నాటికి 20 నుంచి  28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం :  వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
దరఖాస్తు చేసే విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయాలి
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 22.07.2013 నుండి 12.08.2013  వరకు (సుమారుగా).
పరీక్ష తేదీలు:  19.10.2013, / 20.10.2013, / 26.10.2013, /  27.10.2013 (సుమారుగా).

అర్హతలు మరియు ఇతర వివరముల కొరకు దర్శించవలసిన  లంకె
 
పరిక్ష సిలబస్ మరియు పరిక్షకి సిద్ధమయ్యె ప్రణాళిక ఇతర వివరములు తర్వాతి పోస్ట్ లో.....

Sunday, July 7, 2013

బ్యాంకింగ్ రంగంలో, నిరుద్యోగులకు సువర్ణావకాశం....

నిరుద్యోగులకు,  రాబొయే 2-3 సంవత్సరాలలొ బ్యాంకింగ్ రంగంలో సువర్ణావకాశం లభించబోతోంది. 
గత సంవత్సరంలో దేశంలోని అన్ని బ్యాంక్ లలో మొత్తం మీద 80000 దాకా ఉద్యొగాలు ఖాళీలు ఉన్నాయి అన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం.   ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ సంవత్సరం అదనంగా 10000 శాఖలు తెరవబోతున్నయి. అంటే, కనీసం 50000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి అని ఒక అంచనా. దీనితో పాటుగా రాబొయే 2 - 3 సంవత్సరాలలో సుమారుగా మూడవ వంతు ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. దీనిని బట్టి ఉద్యొగావకాశాలు ఇంకా పెరుగుతాయి అని అర్ధం చేసుకోవచ్చు.ఇందుకు అనుగుణంగానే వివిధ బ్యాంకులు భారీగా నియామకాలు ప్రారంభించాయి / కొనసాగిస్తున్నాయి ( గత సంవత్సరం సుమారుగా 50000 నియామకాలు జరిగాయి) . 

అయితే బ్యాంకులలొ ఈ పరిస్థితి ఒక్కసారిగా వచ్చినది కాదు. ప్రత్యేకించి 1990 దశకంలో పెద్దగా విస్తరణ లేక పోవడం, తర్వాత బ్యాంకుల యాంత్రీకరణ (కంప్యూటరీకరణ) జరగడం వలన బ్యాంకులలో పెద్దగా నియామకాలు జరగలేదు. గత 5 -6 సంవత్సరాలుగా శాఖల విస్తరణ బాగా జరగడం, పదవీ విరమణలు జరగడం వలన ఇన్ని ఉద్యొగాలు సృష్టించబడ్డాయి. దీనికి ఫైనాన్షియల్ ఇన్క్లూషన్  కూడా దోహద పడింది.

అయితే ఇన్ని ఉద్యోగావకాశాలు ఉన్నా, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం జరిగిన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ 1500 ఉద్యోగాలకు 10 లక్షల కన్నా ఎక్కువ అభ్యర్ధులు పోటీ పడ్దారు. ముందు ముందు  మిగిలిన బ్యాంకులకు కూడా అంటే IBPS ద్వారా జరిగే నియామకాలకు  కూడా ఇంచుమించుగా పోటీ ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది.  తీవ్రమైన పొటీ ఉంటుంది అని అభ్యర్ధులు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ప్రణాళికాబద్దంగా తయారు అయితే విజయం తప్పక సిద్ధిస్తుంది. ఇంకా పరిక్షలకు నొటిఫికేషన్ వెలువడలేదు కనుక ఇప్పటి నుంచి తయారీ ప్రారంభిస్తే తప్పకుండా వారికి విజయం లభిస్తుంది.

చిరుదీపం అన్న గూగుల్ గ్రూప్ లో ఆసక్తి గల అభ్యర్ధులకి శిక్షణ ఇవ్వటం జరుగుతోంది. ఆసక్తి గల అభర్ధులు గ్రూప్ లోకి ప్రవేశం కొరకు  chirudeepamu@gamil.com మెయిల్ పంపండి.
             
Sunday, May 5, 2013

గ్రూప్ కి ఆహ్వానం

చిరుదీపం కొత్త గూగుల్ గ్రూప్ కి ఆహ్వానం. 

బ్యాంక్ పరిక్షల కోచింగ్, స్టడీ మెటీరియల్, సందేహ నివృత్తి, వివిధ స్వయం ఉపాధి పథకాల గురించి సమాచారం మరింత వివరంగా ఇవ్వడానికి ఆస్కారం వుంటుందనే ఆలోచనతో అభ్యర్ధుల సౌకర్యార్ధం కొత్త గ్రూప్ ప్రారంభించాం. 

ఆసక్తి వున్నవారు chirudeepamu@gmail.com కి మెయిల్ పంపితే గ్రూప్ కి  ఇన్విటేషన్ పంపుతాము.
    
Tuesday, September 13, 2011

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఅపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగ అవకాశములు....

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఅపరేటివ్ సెంట్రల్ బ్యాంక్   అసిస్టెంట్లు/ క్లర్క్ ల ఉద్యోగాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .

మొత్తం ఖాళీలు  - 85  

వయస్సు  1/08/2011 నాటికి  18 సంవత్సరాలనుండి 30  సంవత్సరాల మధ్యలో. 
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 12.09.2011
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ: 03.10.2011

పరీక్ష నిర్వహించు తేదీ - 30.10.2011( tentative )

పూర్తి వివరాలకై   ఇక్కడ  చూడండి.

గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది. 
     
Thursday, September 1, 2011

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఆఫీసర్ ఉద్యొగ అవకాశములు....

రిజర్వ్ బ్యాంక్  ఆఫ్ ఇండియా గ్రేడ్ - B ఆఫీసర్ ఉద్యోగాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .

మొత్తం ఖాళీలు  - 75  

వయస్సు  1/09/2011 నాటికి  21 సంవత్సరాలనుండి 30  సంవత్సరాల మధ్యలో. 

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ  : Sept 26 , 2011  11:59 p .m

పరీక్ష నిర్వహించు తేదీ - Objective Test: 18.12.2011
                                 - Descriptive Test: March /April ( tentative )

పూర్తి వివరాలకై   ఇక్కడ   చూడండి.

గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది. 
    
Monday, August 29, 2011

ఆంధ్ర ప్రదేశ్ పొస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యొగ అవకాశములు...

ఆంధ్ర ప్రదేశ్ పొస్టల్ డిపార్ట్ మెంట్ వారు పొస్టల్ అసిస్టెంట్లు, సార్టింగ్ అసిస్టెంట్లు, పొస్ట్ మాన్ ల నియామకాలకై క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చెయ్యవచ్చు.

విద్యార్హతలు , వయోపరిమితి , జీతభత్యాలు  మొదలైన వివరాలకై  ఇక్కడ చూడండి 
    
గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది. 
    
Thursday, August 25, 2011

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ వారి ఉద్యోగ ప్రకటన (SSC ,Central Govt.)

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) నియామకాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చెయ్యవచ్చు.

 పరీక్ష నిర్వహించు తేదీ  :  04/12/2011 గా ప్రకటించారు.

విద్యార్హతలు , వయోపరిమితి , జీతభత్యాలు  మొదలైన వివరాలకై  ఇక్కడ చూడండి 
    
గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.  

Wednesday, August 24, 2011

APSRTC లో ఉద్యోగ అవకాశము

APSRTC  లో Dy. Superintendent (Material )  పోస్ట్ భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.   మొత్తం ఖాళీలు 76.

రుసుము (ఫీజు) భర్తీ చెయ్యాల్సిన ప్రారంభతేదీ :  08/08/2011

రుసుము (ఫీజు) భర్తీ చెయ్యాల్సిన ఆఖరు తేదీ : 26/08/2011   5 p.m.

ఆన్ లైన్ లో దరఖాస్తు పూర్తి చెయ్యడానికి ప్రారంభతేదీ : 09/08/2011

ఆన్ లైన్ లో దరఖాస్తు పూర్తి చెయ్యడానికి ఆఖరుతేదీ : 29/08/2011  5 p.m.

విద్యార్హతలు , వయోపరిమితి , జీతభత్యాలు  మొదలైన వివరాలకై    Website     చూడండి

గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.  
   
దక్కన్ గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగ అవకాశములు

 దక్కన్ గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగ అవకాశములు
 దక్కన్ గ్రామీణ బ్యాంక్ వారు
01 Officer MMG Scale-II – Group “A’     

02 Officer JMG Scale-I – Group “A”                       

03 Office Assistant - Group “B”      పోస్ట్ లకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్ర్రారంభ తేదీ  ::   23-08-2011
 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరు  తేదీ  ::    16-09-2011       

వ్రాతపరీక్ష నిర్వహించు తేదీలు  ::
01 Officer MMG Scale-II – Group “A’  13-11-2011 at 2.00 PM

02 Officer JMG Scale-I – Group “A” 13-11-2011 at 9.30 AM

03 Office Assistant - Group “B” 30-10-2011 at 9.30 AM               

విద్యార్హతలు , వయోపరిమితి , జీతభత్యాలు  మొదలైన వివరాలకై   బ్యాంక్ వారి   website    చూడండి.

గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.      

Tuesday, August 23, 2011

IBPS CWE( PO పరీక్ష ) వ్రాయడం లో మెళకువలు

 I B P S   C W E  వివిధ బ్యాంక్ లలో PO, Clerical పోస్ట్ ల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. 

PO టెస్ట్ వచ్చే నెలలోనే ఉంది. క్లరికల్ టెస్ట్ కి ఇంకా దాదాపు 2 నెలల వ్యవధి ఉన్నది.  బ్యాంక్ లు అభ్యర్ధులని నియమించుకునేటప్పుడు I B P S CWE లో అభ్యర్ధికి కేటాయించిన స్కొర్ కార్డ్ కి చాలా ప్రాధాన్యతని ఇస్తాయి. ఈ ఉమ్మడి వ్రాత పరీక్ష వలన 19 ప్రభుత్వ రంగ  బ్యాంక్ లకు విడి విడి గా ప్రిపేర్ అయ్యి పరీక్ష వ్రాసే ఇబ్బంది అభ్యర్ధులకి తప్పింది. పరీక్ష బాగా వ్రాసి మంచి స్కోర్ సాధించిన అభ్యర్ధులకి ఈ విధానం వలన చాలా ఉపయోగం ఉంటుంది.     కానీ , సరి అయిన స్కోర్ సాధించలేని అభ్యర్ధి  19 బ్యాంక్ ల నియామకంలోనూ వెనుకపడతారు. అలాంటి వారు మరల I B P S   CWE నోటిఫికేషన్ కొరకు వేచి చూడాల్సి వస్తుంది. ఇదివరకు పద్ధతి లో అయితే ఒక బ్యాంక్ నిర్వహించిన టెస్ట్ లో విఫలం అయితే మరొక బ్యాంక్ టెస్ట్ లో బాగా ప్రయత్నం చేసే అవకాశము ఉండేది. ఇప్పుడు       I B P S ఉమ్మడి వ్రాతపరీక్ష ద్వారా అలాంటి అవకాశము అభ్యర్ధులకి లేదు.  కాబట్టి ఉన్న సమయం సద్వినియోగం చేసుకోండి. ప్రిపరేషన్ మొదలు పెట్టండి.

1.  IBPS  వారు ఇచ్చిన సిలబస్ ప్రకారం చూస్తే 
             రీజనింగ్ 50 
             ఆప్టిట్యుడ్ 50
             బ్యాంకింగ్ నాలెడ్జ్ తో కూడిన జనరల్ అవరెనెస్ 50 
            కంప్యుటెర్ 50  
            ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 మార్కులు
            ఇంగ్లీష్ డిస్క్రిప్ట్ వ్ 25 మార్కులు కేటాయించారు.
కాగా ఒకొక్క విభాగం నుంచి 50 ప్రశ్నలు కేటాయించారు.
మొత్తం రెండున్నర గంటల వ్యవధిలో ఇంగ్లీష్ డిస్క్రిప్ట్ వ్ విభాగానికి విభాగానికి 60  నిమిషాలు పోగా మిగిలిన పేపర్ కి 150 నిమిషాలు సమయం.

2 . అభ్యర్ధి తన సామర్ధ్యాన్ని కచ్చితంగా అంచనా వేసుకోగలగాలి. ప్రతీ సబ్జెక్ట్ లో తన బలాబలాలు తెలిసి ఉండాలి.

3. తప్పు సమాధానికి పెనాల్టీ ఉంటుంది కాబట్టి ఎన్ని సమాధానాలు వ్రాసాము అన్నది కాకుండా ఎన్ని సరైన సమాధానాలు వ్రాసామన్నదాని మీద విజయావకాశం ఆధారపడి ఉంటుంది .

4. అభ్యర్ధి తనకు పట్టుఉన్న విభాగాన్ని ముందుగా పూర్తి చెయ్యడము వలన సమయం ఆదా అవుతుంది నమ్మకం పెరుగుతుంది.

5.  జనరల్ అవేర్ నేస్ ముందుగా ప్రారంభిస్తే మంచిది. ప్రశ్నని సాల్వ్ చెయ్యడానికి ఎక్కువ సమయం పట్టదు.

6. కచ్చితంగా సమాధానం తెలుసు  అన్నవి ముందుగా  పూరించండి..రాని ప్రశ్నలని ఊహించేటప్పుడు కటాఫ్ మార్క్స్ ని కూడా దృష్టి లో ఉంచుకోండి.

7. జనరల్ అవేర్ నేస్ తరువాత ఆంగ్ల విభాగానికి వస్తే మంచిది. వొకాబ్లరీ, గ్రామర్ మీద పట్టు ఉండాలి. 

8 . వ్యాసరచనకై న్యూస్ ఎడిటొరియల్స్ చదవండి. కొత్తపదాలని సంధర్భానుసారంగా వాడండి. అనవసరమైన హంగులకి పోవద్దు. వ్రాసేది సూటిగా సరళంగా చదివేవారికి సులభంగా అర్ధం అయ్యేలా వ్ర్రాయండి. చక్కని చేతివ్రాతతో సంధర్భానుసారంగా కరంట్ఎఫైర్స్ తో వ్యాసాన్ని అనుసంధానించండి.

9. విభాగాల వారీగా చదివినప్పటికీ పాత పేపర్లు పూరించండి. దొరకని వారు మోడెల్ పేపర్లు పూరించండి . ఈ అలవాటు పరీక్ష హాలులో తడబాటు నుంచి మిమ్మలని కాపాడుతుంది. ఎంత ఎక్కువగా అబ్యాసం చేస్తే పరీక్షలో అంత ఎక్కువ సమయం కలసివస్తుంది.మోడెల్ పేపర్లు పూర్తి చేసే ముందు టైమ్ సెట్ చేసుకోవడం మరువకండి. ఎక్కువ సమయం పడుతోంటే మరింత ప్రాక్టీస్ అవసరం అని గుర్తించండి.

10. మీరు ఇంతకు ముందు ప్రిపేర్ అయి వున్నాఇప్పుడు వెంటనే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. 

11. మోడెల్ పేపర్ పూర్తి చేసే ముందు పైన చెప్పిన సూచనలు దృష్టిలో ఉంచుకోండి. 

12. C W E  గురించిన మరిన్ని వివరములకు, కొన్ని మోడల్ పేపర్ల కు ఇక్కడ   చూడండి. 

గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
    
IBPS CWE -- క్లరికల్ పోస్ట్ కై ఉమ్మడి వ్రాత పరీక్ష

IBPS  CWE గురించి తెలుసుకుందుకు   ఇక్కడ   చూడండి.
ఇప్పుడు క్లరికల్ గ్రేడ్ లో అభ్యర్ధుల నియామకం కోసం ఉమ్మడి వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. కేవలము ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చెయ్యాలి.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 25/08/2011

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ : 24/09/2011

పరీక్ష తేదీ : 27/11/2011 

విద్యార్హతలు, వయసు మొదలైన వివరాలకై  IBPS WebSite  చూడండి.

గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.

Saturday, August 20, 2011

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ఉద్యోగాలు....

విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపూర్ వివిధ ఖాళీల భర్తీ కి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ----  95
టెక్నీషియన్  అప్రెంటీస్ --- 158
 లైబ్రరీ సైన్స్ అప్రెంటీస్--- 14
క్యాటరింగ్ టెక్నాలజీ టెక్నీషియన్ అప్రెంటీస్ --- 8

మరిన్ని వివరాలకి   http://vssc.gov.in  చూడండి

http://www.vssc.gov.in:8080/RMT265/rmt265.htm

గమనిక :

1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
            
ఆంధ్రాబ్యాంక్ లో ఉద్యొగ అవకాశములు ....

ఆంధ్రాబ్యాంక్ లో  ఉద్యొగ అవకాశములు (క్రీడాకారులకు ) .

ఆంధ్రా బ్యాంక్ వారు ఆఫీసర్లు, క్లరికల్ మరియు సబ్ స్టాఫ్  పోస్ట్ లకు క్రీడాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

వయస్సు :               
             ఆఫీసర్ -    21 నుంచి 30
             క్లరికల్ -     18 నుంచి 28
             సబ్ స్టాఫ్ - 18 నుంచి 25 

దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  :  27/08/2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ andhrabank.in  దర్శించండి.
http://andhrabank.in/UserFiles/File/SportsAdvt2011.pdf
   
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
   
Tuesday, August 16, 2011

IBPS పరీక్ష సిలబస్ ,ప్రిపరేషన్ విధానము....

IBPS నిర్వహించ బొయే CWE for Bank POs కి వ్రాత పరీక్ష సిలబస్:

S.No
Description
No.of questions
Marks
Time
01.
Reasoning
50
50
Composite time of 150 minutes
02.
English Language
50
25
03.
Quantitative Aptitude
50
50
04.
General Awareness
(With special reference to banking industry)
50
50
05.
Computer knowledge
50
50

Descriptive paper on English composition (Essay,Precis,letter writing etc)

25
60 minutes

Total
250
250

పరీక్ష ప్రిపరేషన్ వివరములు ఈ వెబ్ సైటు లో: 
http://www.chirudeepamu.org

Sunday, August 14, 2011

IBPS పరీక్ష కి సంబందించిన వివరాలు....

బ్యాంక్ పరీక్షకి సంబందించిన common written examination by Institute of Banking Persaonal Selection  కి సంబదించిన మరిన్ని వివరములు  కొత్తగా ప్రారంభించిన  చిరుదీపము వెబ్ సైట్ లో ఉన్నాయి.

ఆ వెబ్ సైట్ లంకె: http://chirudeepamu.org/ 
  
Saturday, July 23, 2011

బ్యాంకు పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారా .. ఈ విషయం గమనించారా ..

IBPS ( Institute of Banking Personal Selection)  IBA ఆధ్యర్యంలో నడుస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఈ సంస్థ 19 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు ల తరఫున PO ( Probationary Officer ) ఉద్యోగాని కై సంవత్సరానికి  2 సార్లు ( అవసరాన్ని బట్టి ) పరీక్ష నిర్వహిస్తుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్ధులకి స్కొర్ కార్డ్ కేటాయిస్తారు. ఆయా బ్యాంక్ లు ఉద్యోగప్రకటన ఇచ్చినప్పుడు ఈ స్కొర్ కార్డ్ మరియు తమ వ్యకిగత వివరాలతో అభ్యర్ధులు తమ దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ తమ నియామక పద్దతి ని అనుసరించి (వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్......) అభ్యర్ధిని నియమించుకుంటుంది.  స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. మొట్టమొదటి సారిగా ఈ పరీక్షకి నోటిఫికేషన్ వెలువడింది.

వివరములకు ఈ లంకె చూడండి 
http://www.ibps.in/career_pdf/cwe_advt.pdf

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
   
Sunday, June 5, 2011

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్ బ్యాంక్ ల లో 4987 Probationery Officer ఉద్యొగ అవకాశములు .

Associate Banks of  State Bank of India ప్రొబేషనరీ ఆఫీసర్   పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :  ప్రొబేషనరీ ఆఫీసర్  ( JMGS 1)  -- 4987
వయస్సు :  As on 01/06/2011 :  21 నుంచి 30
ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 04/06/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  : 25/06/2011
వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 07/08/2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://www.statebankofindia.com/webfiles/uploads/files/1306923612882_ADVT_ABPO_07082011.pdf  దర్శించండి

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
                 
Wednesday, May 18, 2011

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 1000 Probationery Officer ఉద్యొగ అవకాశములు .

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియావారు ప్రొబేషనరీ ఆఫీసర్   పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :  ప్రొబేషనరీ ఆఫీసర్  ( JMGS 1)  -- 1000
వయస్సు :  As on 01/05/2011 :  21 నుంచి 30

ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 18/05/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  : 09/06/2011
వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 27/07/2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://www.statebankofindia.com/webfiles/uploads/files/1305357416999_SBI_PO_17072011_Advt.pdf  దర్శించండి