వచ్చిన వారు

Sunday, November 28, 2010

చిరు దీపము.... ఒక చిన్న ప్రయత్నము

చిరు దీపము....  ఒక చిన్న ప్రయత్నము

దేనికొరకు ? తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి మరి..

దేశానికి స్వాతంత్ర్యము వచ్చిన  ఇన్ని సంవత్సరాలు తర్వాత కూడా మనము ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. ఎప్పటికి  అభివృద్ధి చెందిన దేశముగా మారతామో ఇంకా తెలియదు. దేశానికి  వెన్నెముక అయిన యువతరం లో ఎక్కువ శాతము  రాజకీయనాయకుల స్వలాభానికి ఉపయోగపడుతున్నారు.  కానీ, నిజముగా వారికి దిశా నిర్దేశనములో మాత్రము వారి సహకారము పత్రికల వరకే పరిమితమవుతోంది.
         దేశములో అత్యధిక శాత యువతకి నేడు సరైన స్ఫూర్తి లేదు. చాలా  మందికి ఏమి చదవాలో తెలియదు.  ఎంత చదవాలో తెలియదు  ఎందుకు చదవలో తెలియదు. చదివిన చదువు లక్ష్యము కేవలము ఉద్యోగమేనా ? అలా అయితే ప్రభుత్వ రంగములో  ఉద్యోగావకాశాలు ఎంతవరకు  కల్పిస్తున్నారు? ప్రై వేట్ రంగంలో ఎలాంటి అవకాశాలు  ఉన్నాయి ?  ఈ విషయాలు మీద చాలామదికి అవగాహన లేదు.
         స్వయము ఉపాధి విషయానికి వస్తే ఇందులో కూడా మన యువతది అదే పరిస్థితి .  ఏదైనా   ప్ర్రారంభించాలంటే ఏం చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ? అన్నది  తెలియదు. కొన్ని సంస్థలు   ఈ వివరాలు తెలపడానికి ఏర్పడినా వాటి రుసుము అందరికీ అందుబాటులో ఉండదు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లగురించి కాదు  చిన్న సంస్థలకి ఇది చాలా సమస్య. ఈ సమాచారము కొంతవరకైనా అందించి కొందరికైనా సహాయపడాలనే ఈ చిన్నప్రయత్నము.
         దేశము లో అత్యధిక శాతము ప్రజలు వ్యవసాయము పైన ఆధారపడి ఉన్నారు. ఈ రంగం లో జరిగే పరిశోధన వాటి ఫలాలు కొందరికైనా అందించడానికి ఈ చిన్నప్రయత్నము.
         దేశములో పెరుగుతున్న సంపద సామాన్యులకి చేరట్లేదు. దేశములో జరిగే అవినీతిని తెలియచెప్పేందుకే  ఈ చిన్న ప్రయత్నము.