వచ్చిన వారు

Showing posts with label చదువులు. Show all posts
Showing posts with label చదువులు. Show all posts

Sunday, May 5, 2013

గ్రూప్ కి ఆహ్వానం


చిరుదీపం కొత్త గూగుల్ గ్రూప్ కి ఆహ్వానం. 

బ్యాంక్ పరిక్షల కోచింగ్, స్టడీ మెటీరియల్, సందేహ నివృత్తి, వివిధ స్వయం ఉపాధి పథకాల గురించి సమాచారం మరింత వివరంగా ఇవ్వడానికి ఆస్కారం వుంటుందనే ఆలోచనతో అభ్యర్ధుల సౌకర్యార్ధం కొత్త గ్రూప్ ప్రారంభించాం. 

ఆసక్తి వున్నవారు chirudeepamu@gmail.com కి మెయిల్ పంపితే గ్రూప్ కి  ఇన్విటేషన్ పంపుతాము.
    
   

Tuesday, November 6, 2012

కెరీర్- బయో మెడికల్ ఇంజనీరింగ్


మనకు ఉన్న కెరీర్ అవకాశములలో బయో మెడికల్ ఇంజనీరింగ్ గురించి క్లుప్తంగా చూద్దాం...

Wednesday, October 17, 2012

కెరీర్ ప్లానర్ - 1


ఇందులో మనకి అందుబాటులో ఉన్న వివిధ చదువు / ఉద్యోగ / వ్యాపార అవకాశముల ( Career planning ) గురించి క్లుప్తం గా చూద్దాం.


                                          
  
        

Thursday, December 30, 2010

ఎడ్యుకేషన్ లోన్ - వడ్డీ మాఫీ

మారిటోరియం సమయం * లో విద్యా ఋణము పై వడ్డీ మాఫీ.

మానవ వనరుల శాఖ ఆర్ధికంగా బలహీనులు  అనే వర్గం క్రింద విద్యా ఋణము పై వడ్డీ సబ్సిడీ పధకాన్ని ప్రవేశ పెట్టింది.  ఈ పధకం  క్రింద షెడ్యుల్డ్ బ్యాంక్ ల నుంచి తీసుకున్న విద్యా ఋణము పై మారిటొరియం సమయం లో వడ్డీ మాఫీ చేసింది.

వడ్డీ మాఫీ పొందాలంటే

-- కుటుంబ ఆదాయం సంవత్సరానికి 4.50 లక్షల రూపాయల లోపు ఉండాలి.
-- భారత దేశం  లో సాంకేతిక/ వృత్తి (ప్రొఫెషనల్) విద్య నిమిత్తం ఋణం తీసుకుని ఉండాలి.
-- 2009-10 విద్యా సంవత్సరం నుంచి అప్పుని అవైల్ చేసిన మొత్తం పై వడ్డీ  మాఫీ అవుతుంది.
-- ఆదాయ ధృవపత్రాన్ని సంభందిత బ్యాంక్ కి సమర్పించి ఒక అగ్రిమెంట్ పైన సంతకం చేసిన
    వారికి ఈ సదుపాయం అందుబాటులోకి  వస్తుంది.  
   
కాబట్టి విద్యా ఋణం పొందిన వారు వెంటనే సంభందిత బ్యాంక్ ని సంప్రదించి ఆదాయ ధృవపత్రం సమర్పించి  అగ్రిమెంట్ చేసుకోండి. ఈ సదుపాయాన్ని,  పధకాన్ని   వినియోగించుకోండి.


* మారిటోరియం అంటే అప్పు తీసుకున్న సమయం నుండి రీపేమెంట్ మొదలు అయ్యే వరకు ఉన్న సమయం. అంటే విద్యకాలపరిమితి  + 1  సంవత్సరం లేదా ఉద్యోగం పొందిన తేదీ నుంచి 6 నెలలు ( ఏది ముందు అయితే అది) వరకు వడ్డీ మాఫీ చేస్తారు.