వచ్చిన వారు

Thursday, November 14, 2019

అంకుర సంస్థల (start-up enterprises) స్థాపన – 2



ముందుభాగం 

              



వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ స్థాపించాలంటే మూలధనం సమకూర్చుకోవడం తో పాటుగా ప్రభుత్వం వద్ద నుంచి ఆయా వ్యాపారాల కి తగిన లైసెన్స్ లు మరియు అనుమతులు మంజూరు కావాలి. మూలధన సమీకరణ కొరకు బ్యాంకుల వద్దకి వెళ్ళాలి. ఇవన్నీ సమకూరాక వ్యాపారాన్ని సమర్ధవంతంగా నిర్వహించుకోవాలి. ఈ ప్రోసెస్ లో జరిగే కాలయాపన వలన కావచ్చు, సమాచార లోపం వలన కావచ్చు, చాలామంది ఔ త్సాహికులైన యువత ఈ రంగంలోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారు.

మన  జిడిపి లో సేవారంగం వాటాతో పాటు సెర్వీసెస్ రంగం వాటాని పెంచవల్సిన ఆవశ్యకతని మన ప్రభుత్వం  గుర్తించింది. వ్యాపారరంగ అభివృద్ధి కొరకు చిన్న మధ్యతరహా పరిశ్రమల  అభివృద్ధి కొరకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు  ఇవ్వల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ రంగం లో ఎన్నో మార్పులు, చేర్పులు చేసారు. 


వ్యాపారసంస్థ ప్రారంభం అనుకున్నంత కఠినతరం కాదు. అంకుర సంస్థను ప్రారంభించటానికి అనుసరించాల్సిన పద్ధతులు , తీసుకోవాల్సిన అనుమతులు, ఋణసదుపాయం కోసం సంప్రదించాల్సిన బాంకుల వివరాలు ... అసలు ప్రాధమికంగా ప్రస్తుతం ఏయే పథకాలు ఉన్నాయి ?  అవి సబ్సిడీలు  ఎలా ఇస్తున్నాయి అన్న విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఈ అంశాల మీద పట్టు మనకి వ్యాపార ప్రారంభానికి ఊతం  అవుతుంది. .

      
        ఇక వచ్చే  పోస్ట్ లలో ఈ విషయాలన్నీ పరిశీలిద్దాం. ఈ పోస్ట్ ల యొక్క ముఖ్య ఉద్దేశ్యం యువతకి సరైన సమాచారం అందిచడం. దానివల్ల ఔత్సాహికులు ప్రభుత్వ పథకాల్ని మరియు మార్కెట్ లో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. 

ఇంకా ఉంది.