వచ్చిన వారు

Friday, December 14, 2012

ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 3


పసుపుకొమ్ములు సేకరించాక వాటిని ఆరబెట్టి , తుడిచి శుభ్రం చేస్తారు. 
తర్వాత వాటిని ఒక డ్రమ్ లో వేసి యంత్ర సహాయంతో తిప్పుతారు. దీని
వలన పైన ధూళి అంతా పోయి శుభ్రమవుతుంది. తర్వాత వాటిని గ్రేడింగ్
చేస్తారు. పసుపు కొమ్ము సైజ్ ని బట్టి ఈ గ్రేడింగ్ జరుగుతుంది. 
ముడిపసుపుకొమ్ముకి ఈ విధంగా శుభ్రరపరచిన కొమ్ముకి సాధారణంగా  20 శాతం నుంచి 25 శాతం వరకు ధరలో తేడా వుంటుంది. ఈ విధంగా శుభ్రపరచిన పసుపు కొమ్ములని పొడి చేస్తారు. ఈ మొత్తం ప్క్రిలో సుమారుగా  7% నుంచి 10% తరగు పోతుంది.
 

పసుపు మరియు మిరప ప్రోసెసింగ్ కి అయ్యే ఖర్చులు ( సుమారుగా - క్లో) :

భూమి   సుమారుగా  350 sq. mts.  కావలసి వస్తుంది.

అందులో 150 sq. mts బిల్డింగ్ కి కావాల్సివస్తుంది.

1. Cost of Building --                                             Rs.2.00
2. Polishing, Grading and Grinding machinery -  Rs.2.00 

3. Sealing and weighing machines -                      Rs.0.20 
4. Other Misc. assets -                                           Rs.0.80 



Total                                                                     Rs.5.00

ఇందులో రూ. 3.75 లక్షల వరకు బ్యాంక్ లోన్ ( టర్మ్ లోన్ గా) పొందే అవకాశం ఉంది. దీనితో పాటుగా సుమారుగా రూ. 2.00 లక్షల వరకు బ్యాంక్ లోన్ ( వర్కింగ్  కాపిటల్ లోన్ గా) పొందే అవకాశం ఉంది. అయితే ఇందులో స్థల వ్యయాన్ని కలప లేదు మరియు పరిశ్రమ సామర్ధ్యం 100 tonnes p.a.


సాధారణ పరిస్థితులలో సంవత్సరానికి రెండు లక్షల రూపాయల వరకు నికర లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది వివిధ పరిస్థుతల పైన  అధారపడుతుంది.
          
           

No comments:

Post a Comment