వచ్చిన వారు

Sunday, September 29, 2013

C F L బల్బుల తయారీ - లాభాలు....

స్వయం ఉపాధి పధకాలలో C F L బల్బుల తయారీ ఒక లాభదాయకమైన రంగము. ఈ బల్బులకి మార్కెట్ డిమాండ్ కూడా బాగా ఉంది. వీటి గురించి మరియు ఈ బల్బుల తయారీలో వచ్చే లాభాలను గురించి క్లుప్తంగా చూద్దాం.


C F L  ( Compact Fluorscent Light ) బల్బుల వలన ఉపయోగాలు:
  • ఈ C F L బల్బులు పర్యావరణ సమతుల్యానికి దోహద పడతాయి.
  • ఇవి సాధారణ బల్బు( Incandescent bulb)  కన్నా7 నుంచి 10 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.
  • ఈ బల్బులు 6000 నుంచి  15000 గంటలు మన్నితే, సాధారణ బల్బులు 750 నుంచి 1000 గంటలు పని చేస్తాయి.
  • ఇవి సాధారణ బల్బుల కంటే 50 %  నుండి  80 % వరకు విద్యుత్ ను ఆదాచేస్తాయి.
  • ఈ  C F L బల్బులు 60 నుంచి 72  lumens per watt అయితే, సాదారణ బల్బుల నుంచి 8 నుంచి  17 lumens per watt వస్తుంది.
  •  ఈ బల్బులను, సాధారణ బల్బులతో పోల్చితే :

C F L Bulb Normal Bulb Min light
9 – 13 wats 40 wats 450 lumens
25 – 30 wats 100 wats 1600 lumens
30-52 wats 150 wats 2600 lumens

ఈ C F L బల్బుల వలన వినియోగదారులకు ఇన్ని ఉపయోగాలు ఉండబట్టే వీటి ధర సాధారణ బల్బుల కన్నా ఎక్కువ అయినా వీటికి మంచి మర్కెట్ ఉంది.

 C F L బల్బుల తయారీ సంస్ధ కు వచ్చే లాభాలు:

25000 బల్బుల తయారీ సంస్థ కు సాధారణ పరిస్థితులలో కావలసిన పెట్టుబడి మరియు వచ్చే లాభాలు:
  •  భవనం - 300 to 400 Sq.mts
  • విద్యుత్ - 5 Kw
  • తయారీ ప్లాంట్ - 1,50,000/- to 2,00,000/-
  • మిగిలిన ఖర్చులు- 1,00,000/-
ప్రతినెలకు అయ్యే ఖర్చులు:
  •  ముడి సరుకులు( Glass Tubes,Plastic body, caps, etc...), జీతభత్యాలు, విద్యుత్, మొదలైనవి- 1,80,000/-
C F L బల్బులు అమ్మడం వలన వచ్చే ఆదాయం ( ఒక్కొక్కటి Rs.100/- చొప్పున )-  Rs. 26,25,000/-

సంవత్సరానికి వచ్చే నికర లాభం - Rs.4,65,000/-
ఈ తయారీలో బల్బులను 5 నుంచి 6  స్టేజి లలో పరిక్షిస్తారు.  మరియు పై న చెప్పిన పెట్టుబడి, లాభాలు సాధారణ పరిస్థితులలో వచ్చేవి.  సంస్థ ఎక్కడ పెడుతున్నామో ఆ ప్రదేశం ను సర్వే చేసుకుని సంస్థ ని ప్రారంభించి, ప్రమాణాలను పాటిస్తే సంస్థ ను మంచి లాభాల బాటలో నడిపించవచ్చు.


No comments:

Post a Comment