నేటి యువత కు అందుబాటులో ఉన్న కొన్ని స్వయం ఉపాధి పధకాలు పరిశీలిద్దాం. మొదటగా Prime Minister's Employement Generation Programme ( PMEGP ) పధకాన్ని పరిశీలిద్దాం.
31-03-2008 వరకు మన దేశం లో ఉన్న రెండు పధకాలని [Prime Mininster's Rojgar Yojana (PMRY) & Rural Employement Generatin Programme (REGP)] కలిపి PMEGP పధకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఈ పధకం ( Ministry of Micro,Small and Medium Enterprises ( MoMSME ) పరిధి లోనిది. దీనిని Khadi and Village Industries Commission (KVIC) అమలు చేస్తుంది. రాష్ట్రాలలో రాష్ట్ర KVIC Directors , Khadi and Village Industries Boards (KVIB) మరియు District Industries Centres ( DIC ) లు బ్యాంక్ ల ద్వారా అమలు చేస్తాయి.
ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఉపాధి అవకాశాలు పెంపొందించడం .
పధకం అమలు తీరు :
KVIC, KVB, DIC లు దరఖాస్తులని అహ్వానిస్తాయి. ఈ ఏజన్సీ ల ద్వారా కాకుండా అభ్యర్ధులు తమ దరఖాస్తులని నేరుగా బ్యాంక్ లకి కూడా అందచేయవచ్చు. వీరు అభ్యర్ధులు అనుభవం, విద్యార్హతలు ప్రత్యేక నైపుణ్యాలు మరియు ఎన్నుకున్న ప్రాజెక్ట్ యొక్క సఫలీకృత అవకాశాలు పరిశీలించి దరఖాస్తులని ఎన్నిక చేస్తారు. ఎన్నిక కాబడ్డ దరఖాస్తులు సంబందిత బ్యాంక్ కి పంపిస్తారు.
దరఖాస్తులని పరిశీలించాకే బ్యాంక్ లు నిర్ణయం తీసుకుంటాయి. సాదరణముగా బ్యాంక్ లు పరిశీలించే అంశాలు దరఖాస్తు దారు వయస్సు, అనుభవం, విద్యార్హతలు, దరఖాస్తు దారు స్వయంగాగా గానీ , లేక అతని కుటుంబసభ్యులలో ఎవరైనా ఈ ప్రయోజనం పొందారా ? ఏ వ్యాపారం ప్రారంభించబోతున్నారు? ఆ వ్యాపారం ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించగలరు? వ్యాపారం విజయవంతం అవ్వటానికి గల అవకాశాలు , మార్కెట్ లో ఉన్న పోటీ, అపోటీని ఎదుర్కునే సామర్ధ్యం దరఖాస్తుదారికి ఎంతవరకు ఉంది?.
అభ్యర్ధులు సాధారణంగా ఈ పత్రాలని అందిచాల్సి ఉంటుంది.
1. Candidate's Identity Proof, Residential Proof
2. Age Proof, Proof of education
3. Proof of Category (if applicable)
4. Details of candidate and about the project - Project report etc.
అభ్యర్ధులు పూర్తి చెయ్యాల్సిన శిక్షణా కర్యక్రమం , లోన్ సాంక్షన్ వివరాలు తరవాత పోస్ట్ లో చూద్దాం.
No comments:
Post a Comment