మారిటోరియం సమయం * లో విద్యా ఋణము పై వడ్డీ మాఫీ.
మానవ వనరుల శాఖ ఆర్ధికంగా బలహీనులు అనే వర్గం క్రింద విద్యా ఋణము పై వడ్డీ సబ్సిడీ పధకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పధకం క్రింద షెడ్యుల్డ్ బ్యాంక్ ల నుంచి తీసుకున్న విద్యా ఋణము పై మారిటొరియం సమయం లో వడ్డీ మాఫీ చేసింది.
వడ్డీ మాఫీ పొందాలంటే
-- కుటుంబ ఆదాయం సంవత్సరానికి 4.50 లక్షల రూపాయల లోపు ఉండాలి.
-- భారత దేశం లో సాంకేతిక/ వృత్తి (ప్రొఫెషనల్) విద్య నిమిత్తం ఋణం తీసుకుని ఉండాలి.
-- 2009-10 విద్యా సంవత్సరం నుంచి అప్పుని అవైల్ చేసిన మొత్తం పై వడ్డీ మాఫీ అవుతుంది.
-- ఆదాయ ధృవపత్రాన్ని సంభందిత బ్యాంక్ కి సమర్పించి ఒక అగ్రిమెంట్ పైన సంతకం చేసిన
వారికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
కాబట్టి విద్యా ఋణం పొందిన వారు వెంటనే సంభందిత బ్యాంక్ ని సంప్రదించి ఆదాయ ధృవపత్రం సమర్పించి అగ్రిమెంట్ చేసుకోండి. ఈ సదుపాయాన్ని, పధకాన్ని వినియోగించుకోండి.
* మారిటోరియం అంటే అప్పు తీసుకున్న సమయం నుండి రీపేమెంట్ మొదలు అయ్యే వరకు ఉన్న సమయం. అంటే విద్యకాలపరిమితి + 1 సంవత్సరం లేదా ఉద్యోగం పొందిన తేదీ నుంచి 6 నెలలు ( ఏది ముందు అయితే అది) వరకు వడ్డీ మాఫీ చేస్తారు.
No comments:
Post a Comment