వచ్చిన వారు

Friday, July 12, 2013

బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్ల నియామకాలు...

వివిధ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్లు, మేనేజ్ మెంట్ ట్రేయినీ లకై  IBPS  నిర్వహించు ఉమ్మడి వ్రాత పరీక్షకై
( CWE - PO/ MT ) - III నోటిఫికేషన్ వెలువడింది.

వయోపరిమితి :  1/07/2013 నాటికి 20 నుంచి  28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం :  వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
దరఖాస్తు చేసే విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయాలి
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 22.07.2013 నుండి 12.08.2013  వరకు (సుమారుగా).
పరీక్ష తేదీలు:  19.10.2013, / 20.10.2013, / 26.10.2013, /  27.10.2013 (సుమారుగా).

అర్హతలు మరియు ఇతర వివరముల కొరకు దర్శించవలసిన  లంకె
 
పరిక్ష సిలబస్ మరియు పరిక్షకి సిద్ధమయ్యె ప్రణాళిక ఇతర వివరములు తర్వాతి పోస్ట్ లో.....


Sunday, July 7, 2013

బ్యాంకింగ్ రంగంలో, నిరుద్యోగులకు సువర్ణావకాశం....

నిరుద్యోగులకు,  రాబొయే 2-3 సంవత్సరాలలొ బ్యాంకింగ్ రంగంలో సువర్ణావకాశం లభించబోతోంది. 
గత సంవత్సరంలో దేశంలోని అన్ని బ్యాంక్ లలో మొత్తం మీద 80000 దాకా ఉద్యొగాలు ఖాళీలు ఉన్నాయి అన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం.   ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ సంవత్సరం అదనంగా 10000 శాఖలు తెరవబోతున్నయి. అంటే, కనీసం 50000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి అని ఒక అంచనా. దీనితో పాటుగా రాబొయే 2 - 3 సంవత్సరాలలో సుమారుగా మూడవ వంతు ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. దీనిని బట్టి ఉద్యొగావకాశాలు ఇంకా పెరుగుతాయి అని అర్ధం చేసుకోవచ్చు.ఇందుకు అనుగుణంగానే వివిధ బ్యాంకులు భారీగా నియామకాలు ప్రారంభించాయి / కొనసాగిస్తున్నాయి ( గత సంవత్సరం సుమారుగా 50000 నియామకాలు జరిగాయి) . 

అయితే బ్యాంకులలొ ఈ పరిస్థితి ఒక్కసారిగా వచ్చినది కాదు. ప్రత్యేకించి 1990 దశకంలో పెద్దగా విస్తరణ లేక పోవడం, తర్వాత బ్యాంకుల యాంత్రీకరణ (కంప్యూటరీకరణ) జరగడం వలన బ్యాంకులలో పెద్దగా నియామకాలు జరగలేదు. గత 5 -6 సంవత్సరాలుగా శాఖల విస్తరణ బాగా జరగడం, పదవీ విరమణలు జరగడం వలన ఇన్ని ఉద్యొగాలు సృష్టించబడ్డాయి. దీనికి ఫైనాన్షియల్ ఇన్క్లూషన్  కూడా దోహద పడింది.

అయితే ఇన్ని ఉద్యోగావకాశాలు ఉన్నా, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం జరిగిన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ 1500 ఉద్యోగాలకు 10 లక్షల కన్నా ఎక్కువ అభ్యర్ధులు పోటీ పడ్దారు. ముందు ముందు  మిగిలిన బ్యాంకులకు కూడా అంటే IBPS ద్వారా జరిగే నియామకాలకు  కూడా ఇంచుమించుగా పోటీ ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది.  తీవ్రమైన పొటీ ఉంటుంది అని అభ్యర్ధులు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ప్రణాళికాబద్దంగా తయారు అయితే విజయం తప్పక సిద్ధిస్తుంది. ఇంకా పరిక్షలకు నొటిఫికేషన్ వెలువడలేదు కనుక ఇప్పటి నుంచి తయారీ ప్రారంభిస్తే తప్పకుండా వారికి విజయం లభిస్తుంది.

చిరుదీపం అన్న గూగుల్ గ్రూప్ లో ఆసక్తి గల అభ్యర్ధులకి శిక్షణ ఇవ్వటం జరుగుతోంది. ఆసక్తి గల అభర్ధులు గ్రూప్ లోకి ప్రవేశం కొరకు  chirudeepamu@gamil.com మెయిల్ పంపండి.