ఈ టపా ముందు భాగాలు స్వయంఉపాధి / వ్యవసాయం లేబుల్స్ లో చూడవచ్చు.
వచ్చే లాభమెంత ..?
ఉదాహరణకి ఒక 500 లీటర్ల పాల ప్రొసెస్సింగ్ ప్లాంట్ కి ఏఏ వసతులు కావాలి, ఎంత పెట్టుబడి కావాలి ఎంత లాభం వచ్చే అవకాశం ఉందో ఈ టపాలో చర్చిద్దాం.
ప్లాంట్, మౌలికవసతులు గల( రోడ్.నీరు మొదలైన సదుపాయాలు) గల ఒక మేజర్ పంచాయితీలో పెట్టగలిగితే మంచిది. పాల యొక్క ధర నిర్ణయం FAT / SNF పరీక్ష ద్వారా నిర్ణయించాలి. ఈ షరతులు పాటించి వ్యయ నిర్ణయం లాభనిర్ణయం జరిగిందని గమనించండి.
ప్లాంట్ కి కావలసిన యంత్రసామాగ్రి వీటినే స్థిర ఆస్థులు గా చెప్పవచ్చు ఉదాహరణకి బరువు తూచే యంత్రం , Bulk Cooler, Refrigeration unit, Cream Separator, Fat testing machine... మొదలైనవి వీటికి సుమారుగా 2,50,000 రూపాయలు అవుతుంది.( ఇందులో భవనం అద్దె కలుపలేదు).
పాల కొనుగోలు, సిబ్బంది జీతాలు మొదలైన చర ఖర్చులకి రోజుకి సుమారుగా 13,200 రూపాయలు అవుతుంది. దీనికి బ్యాంక్ వడ్డీ, తరుగుదల వంటివి కలిపితే 13,500 రూపాయలు అవుతుంది.
పాలు, వెన్న అమ్మకము ద్వారా రొజుకు 15,000 రూపాయలు దాకా ఆదాయము వస్తుంది. అంటే రొజుకు 1500 రూపాయలు లాభం.
ఇవి కాక నిలువ ఉండే పనీర్, నెయ్యి మొదలైన అదనపు ఉత్పత్తులు చెయ్యగలిగితే మరింత వ్యాపారం విస్తరిస్తుంది.
పాలు సంపూర్ణపోషకాహారం అంటారు. పసిపిల్లలు , రోగులు, గర్భిణీలు, ఎక్కువగా ఆధారపడే పాలు అమ్మకంలో నాణ్యత పాటించండి.శుభ్రత ని పాటించండి. ఆరోగ్యాలకి హాని చేసే రసాయనాలు కలపకండి. మీరు పాటించే విలువలు మీ వ్యాపారానికి ప్రధమ పెట్టుబడి. వినియోగదారుని విశ్వాసం చూరకొనటమే అసలైన లాభార్జన.
బ్యాంక్ ఋణము కావలసిన వారు ఇంతకు ముందు వ్రాసిన PMEGP 1 , PMEGP- 2 టపాలు చూడండి.
మరిన్ని ఋణ పథకాలు తరవాత టపా లలో తెలియచేస్తాను. మిల్క్ ప్రొసెస్సింగ్ లో మరిన్ని ఉపాధి అవకాశాలని కూడా తరువాత టపా లలో తెలుసుకుందాము.